హైదరాబాద్, ఆగస్టు 30,
రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యాసంస్థల్లో భౌతికంగా తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో యేడాదిన్నరగా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యాసంస్థల బస్సులు మూలన పడ్డాయి. విద్యాసంస్థల ప్రారంభంతో అవే బస్సులు వచ్చే నెల 1 నుంచి మళ్లీ రోడ్డెక్కనున్నాయిఈ నేపథ్యంలో స్కూలు బస్సుల పరిస్థితిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. కరోనాకు ముందు రోజూ నడిచే బస్సులే నిబంధనలకు అనుగుణంగా లేక, కాలం చెల్లిన బస్సులకు కలర్ వేసి నడిపిస్తున్న వాటిని ఆర్టీఏ అధికారులు పట్టుకోవడాన్ని చూశాం. అలాంటిది మూలన పడిన బస్సుల ఫిట్‌నెస్, కండిషన్‌పై రవాణా శాఖ దృష్టి పెట్టనుంది.మోటారు వాహన చట్టంలో రూపొందించిన విధంగా స్కూల్ బస్సులో ఉండాల్సిన వస్తువులు లేకపోగా.. బస్సులు మూలకు పడేయడంతో చాలా వరకూ పాడైపోయాయి. అయితే, వాటిని ఈ 3 రోజుల్లోగా రిపేర్ చేయించుకోవాల్సి ఉంది. కానీ, ఈ విషయంపై ఇంకా యాజమాన్యాలు దృష్టి సారించకపోవడం గమనార్హం.ప్రతీ సంవత్సరం స్కూలు బస్సులకు భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా ఫిట్‌నెస్‌ను రవాణా శాఖ చేపడుతుంది. అయితే, కరోనా కారణంగా ఇదివరకే ఉన్న బస్సుల ఫిట్‌నెస్ వెరిఫికేషన్‌ను సెప్టెంబర్30 వరకూ కేంద్ర ప్రభుత్వం పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బస్సుల కండిషన్‌ను గుర్తించే పనిలో రవాణా శాఖ పడిందిదీనికోసం విద్యాసంస్థల యాజమాన్యాలకు ఫోన్‌ల ద్వారా సమాచారాన్ని అందిస్తూ వాహనాలను కండిషన్‌లో ఉంచే విధంగా వారికి అవగాహన కల్పిస్తున్నారు. అయితే, ఫిట్‌నెస్ గడువు పొడగించిన నేపథ్యంలో బస్సుల కండిషన్‌ను చెక్ చేసి, పరిమితికి మించి పిల్లలను ఎక్కించిన వారిపై ఎక్కడికక్కడ చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అధికంగా విద్యాసంస్థలున్న హైదరాబాద్‌లో కాలం చెల్లిన బస్సులను నిర్మూలించే విధంగా తనిఖీలు చేసేలా రవాణా శాఖ అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటుచేసి తమ పరిధిలో ఉన్న స్కూల్స్, కాలేజీల్లోని బస్సులను తనిఖీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా నిబంధనలు బేఖాతరు చేసే వారి బస్సులను సీజ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.స్కూల్స్ స్టార్ట్ అవగానే స్పెషల్ టీంలు ఏర్పాటు చేస్తాం. రోడ్డెక్కిన బస్సులను మా టీం సభ్యులు తనిఖీ చేస్తారు. నిబంధనలకు విరుద్దంగా బస్సు కండిషన్ ఉంటే సహించం. విద్యార్థుల సంరక్షణే విద్యాసంస్థల ధ్యేయంగా అనుకొని బస్సులను కండిషన్‌లో ఉంచుకోవాలి. బస్సులకు ఎలాంటి రిపేర్లు ఉన్నా వెంటనే బాగుచేపించే విధంగా విద్యాసంస్థలకు సూచిస్తున్నాం. బడులు మొదలవకముందే రివ్యూ మీటింగ్ నిర్వహిస్తాం.