YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉస్మానియాలో కీచక పర్వం

ఉస్మానియాలో కీచక పర్వం

వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రికి చెందిన వార్డు బాయ్, అఫ్జల్గంజ్ పోలీసుస్టేషన్కు చెందిన హోంగార్డు, ప్రైవేటు అంబులెన్స్ డ్రైవరు ముగ్గురు కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అఫ్జల్గంజ్ ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ సమీపంలోని హీరానగర్ బస్తీకి చెందిన ఓ మహిళ (35) ఈ నెల 2న భర్తతో గొడవపడింది. భర్త ఆమెను కొట్టడంతో అదే రోజు రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్కార్టుగా మహిళా పోలీసులను ఆమె వెంట పంపించాల్సిన పోలీసులు పంపకుండా, మెడికో లీగల్ కేసు నమోదు చేయాలని ఉస్మానియా వైద్యాధికారులకు లేఖ రాసి ఆమె చేతికే ఇచ్చి పంపించారు. చికిత్స నిమిత్తం ఉస్మానియాకు చేరిన ఆమెను అత్యవసర చికిత్సా విభాగం లో విధులు నిర్వర్తించే వార్డు బాయ్.. వైద్యం చేయించడంతోపాటు నీ భర్తపై కేసు నమోదు చేయిస్తానంటూ నమ్మించాడు. వైద్యం చేయించిన అనంతరం వార్డు బాయ్, ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్, అఫ్జల్గంజ్ పోలీసు అవుట్పోస్టుకు చెందిన హోంగార్డు కలిసి తనను ఓపీ భవనం మొదటి అంతస్తులోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు తెల్లవారుజామున ఉస్మానియా ప్రధాన గేటు దగ్గరున్న కానిస్టేబుల్ సాయంతో బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. అత్యాచారం జరిగిన ప్రాంతం అఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోనికి వస్తుందని బంజారాహిల్స్ పోలీసులు ఆమెను పంపించేశారు. అనంతరం తను పని చేసే ఇంట్లో న్యాయవాది సహాయంతో బాధితురాలు శుక్రవారం అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఉస్మానియాలోని అత్యవసర విభాగం, ప్రధాన ప్రవేశమార్గం, రెండో అంతస్తులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. రాత్రి విధుల్లో ఎంత మంది సిబ్బంది ఉన్నారని ఆరా తీశారు. ఉస్మానియా వార్డుబాయ్ నాగరాజుపైనే బాధితురాలు ఫిర్యాదు చేసిందని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అఫ్జల్గంజ్ ఎస్సై సైదులు తెలిపారు. మరో ఇద్దరిపై ఫిర్యాదు అందలేదన్నారు.

Related Posts