తెరాస, ఎంఐంఎ రెండూ ఒక్కటే
హైదరాబాద్
'ప్రజా సంగ్రామ యాత్ర' ప్రారంభం ఎలా జరిగిందో... దేశవ్యాప్తంగా తెలిసింది. మొన్న ప్రారంభమైన పాదయాత్ర నిన్న రాత్రి 2 గంటల వరకు కొనసాగిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సోమవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. యువతీ, యువకులు, మహిళలు, పెద్దవాళ్ళు పాదయాత్రకు బాగా మద్దతిస్తున్నారు. మంగళ హారతులు పడుతున్నారు. పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా అనేక సమస్యలు చెప్తున్నారు. పాదయాత్రలో ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చారు. తెలంగాణలో అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం పై ప్రజలు బాధ, ఆవేశం, ఆవేదనలో ఉన్నారు.నేను పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించే అడుగుతున్నారు. 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన' కింద తెలంగాణ కు 2 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేసింది... వాటికి అదనంగా రూ.1.40 వేలు ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల జాబితా ఇమ్మంటే... ఇప్పటివరకు కేసీఆర్ ఆ లిస్ట్ ఇవ్వలేదు. కాంట్రాక్టర్ల కమిషన్ ల కోసమే ఇల్లు కడుతున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో బీజేపీ హయాంలో 70 వేల ఇళ్లు ఏడాదిలో పూర్తి చేశారు. 40 ఎకరాల స్థలంలో బోజగుట్ట లో ప్రభుత్వ అధికారులు తమ ఇళ్లను ఖాళీ చేయించారని స్థానికులు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్లి రూమ్ రెంట్ కట్టుకునే పరిస్థితిలో కూడా లేరు. డబుల్ బెడ్ రూమ్ లు వస్తాయని బోజగుట్ట వాసులు ఖాళీ చేస్తే... ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇలా తయారైంది. 100 రూమ్ ల గడీని... వందల కోట్లతో కేసీఆర్ కట్టుకున్నాడు. అర్బన్ లో 8000 డబుల్ ఇళ్లు మాత్రమే కట్టించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అనేవి కేసీఆర్ తో కావు. 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన' కింద నిర్మించే ఇళ్ళకైనా కేసీఆర్ సహకరించాలని డిమాండ్ చేసారు. రూ. 3500 కోట్లను కేంద్రం మంజూరు చేసింది... 2500 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. తెలంగాణ కు అదనంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయించే బాధ్యత మాది. 2 లక్షల 3 వేల ఇళ్లను వెంటనే కట్టించాలి. రూ.1280 కోట్ల నిధులను ఆర్థికసంఘం జీహెచ్ఎంసీ కి ఇచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవు. సీఎం కు సోయ లేదు. బయట ప్రజల పరిస్థితి కుక్కలకంటే హీనం అయింది. ప్రైవేట్ కార్మికుల బాధలు అంతా ఇంతా కాదు. తెలంగాణ లో ఇప్పటికైనా ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాని అన్నారు. ఎన్నికలొస్తేనే ప్రజలకు పసందైన భోజనం పెడతాడు(బోటి, లివర్, షేరువా, బిర్యానీ లు). ఉప ఎన్నిక వస్తేనే... కేసీఆర్ బయటికి వస్తాడు. నా పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకునే అవకాశం లభించింది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ సమస్యలనే చెప్పుకుంటున్నారు. నా విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తే... ప్రజలు తిప్పికొడతారు..తిరగబడతారు. స్మశాన వాటికల నిర్మాణానికి పైసలు ఇచ్చింది కేంద్రమే. రెండు రోజుల 'ప్రజా సంగ్రామ యాత్ర' విజయవంతం అయింది.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. పాతబస్తీలో ఎంఐఎం గుండాల చేతిలో నలిగిపోయిన హిందువులకు అండగా ఉండడం కోసమే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించాం. పాతబస్తీని వదిలిన హిందువులు మళ్లీ తిరిగి వచ్చేలా చేస్తాం. పాతబస్తీ అభివృద్ధి కి కట్టుబడి ఉన్నాం. బీజేపీ ఎప్పుడూ తెరాస తో కలిసి పోటీ చేయలేదు. తెరాస, ఎంఐంఎ రెండూ ఒక్కటేనని అయన ఆరోపంచారు.