రాజన్న ఆలయం కిటకిట
వేములవాడ
తెలంగాణలో శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి సోమవారం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. శ్రావణ మాసం నాలుగో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనాలు ఆలస్యం అయ్యింది.మరోవైపు, సోమవారం తెల్లవారుజాము నుంచే పట్టణంతోపాటు, వేములవాడ నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండటంతో భక్తులు తడిసి ముద్దయ్యారు