YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పలు అభివృద్ధి పనులకు స్పీకర్  పోచారం శంకుస్థాపన

పలు అభివృద్ధి పనులకు స్పీకర్  పోచారం శంకుస్థాపన

పలు అభివృద్ధి పనులకు స్పీకర్  పోచారం శంకుస్థాపన
కామారెడ్డి ఆగష్టు 30
జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. బీర్కూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో రూ.54 లక్షలతో నిర్మించే ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గధులకు, 30 డబుల్ బెడ్ రూం ఇండ్లకు, రూ. 20 లక్షలతో సిసీ రోడ్లు, డ్రైనేజీలు‌, రూ.5 లక్షలతో పద్మశాలీ సంఘం భవనం, రూ. 5 లక్షలతో బత్తిన సంఘం భవనాలకు స్పీకర్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బీర్కూరు తండాలో నూతనంగా నిర్మించే 15 డబుల్ బెడ్ రూం ఇండ్లకు, రూ.5 లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ భవనం ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ…తెలంగాణ తిరుమల దేవస్థానం నెలకొన్న తిమ్మాపూర్ గ్రామం విశిష్టమైందన్నారు. ఆలయం విస్తరణ, భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి రూ. 23 కోట్లతో దేవస్థానం వద్ద అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు.నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లును మంజూరు చేస్తామన్నారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా గోదావరి నీళ్లు ఇప్పటికే నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వస్తున్నాయి.మల్లన్న సాగర్ జలాశయం నుంచి ప్రత్యేకంగా తవ్వే మరో కాలువ ద్వారా రోజుకు అర ఒక టీఎంసీ నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని నాన్ ఆయకట్టు పరిధి ప్రాంత భూములకు నీళ్లందించడానికి రూ. 36.50 కోట్లతో చందూరు, రూ.70 కోట్లతో జాకోర ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా 12,000 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది.మంజీరా నదిపై నియోజకవర్గ పరిధిలో నాలుగు చెక్ డ్యాంలను నిర్మిస్తున్నామని స్పీకర్‌ పోచారం తెలిపారు. దేశాన్ని ఎక్కువ కాలం నుంచి పరిపాలిస్తున్న పార్టీలు అభివృద్ధి చేయలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మాట్లాడాలి. అంతేకానీ అనవసరంగా విమర్శలు చేయొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు.

Related Posts