దేశంలో అస్ధిరత సృష్టించేందుకు పనిచేస్తున్న భారత వ్యతిరేక శక్తులు
రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్
న్యూఢిల్లీ ఆగష్టు 30
దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటి నుంచి దేశంలో అస్ధిరత సృష్టించేందుకు భారత వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ అన్నారు. భారత్‌లో అలజడి రేపేందుకు పాకిస్తాన్ భూభాగం నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయని పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. ఓ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సరిహద్దుల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని పేర్కొంటూ భారత్ పొరుగు దేశం చర్యల పట్ల వేచిచూసే ధోరణి అవలంభిస్తోందని అన్నారు.ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గల్వాన్ లోయ ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా అమర జవాన్ల సేవలను మంత్రి కొనియాడారు. భారత సైన్యం చూపిన సంయమనం, అసమాన ధైర్యసాహసాలు రాబోయే తరాలకూ గర్వకారణమని అన్నారు. లడఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని, ఇవి మౌలిక ప్రాజెక్టులే కాకుండా జాతీయ సెక్యూరిటీ గ్రిడ్‌లో కీలక భాగమని రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పేర్కొన్నారు.