పారిశుద్ధ్య పనులు వేగవంతంగా చేయాలి
జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
జగిత్యాల ఆగస్టు 30
సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్న నైపథ్యం పాఠశాలల్లో
పారిశుద్ధ్య పనులు వేగవంతంగా చేయాలని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత - సురేష్ ఆన్నారు. సోమవారం సెప్టెంబర్ 1వ తేదీ నుండి పాఠశాలలు పున:ప్రారంభం దృష్ట్యా కొడిమ్యాల మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ హైస్కూల్ జగిత్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ సందర్శించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ కొడిమ్యాల్ జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాలలో ఆశించిన స్థాయిలో పారిశుద్ధ్యం మరియు శానిటేషన్ లేనందున గ్రామ పంచాయతీ సెక్రెటరీకి,ఎంపీడీఓ కి సాయంత్రం వరకు శుభ్రం చేయాలని ఆదేశించారు.విద్యార్థులకు అవసరమైన మస్కులు, సానిటీజర్ లు అందుబాటులో ఉంచాలని అన్నారు.అనంతరం పూడూర్ జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల జడ్పీటీసీ పుణుగోటి ప్రశాంతి కృష్ణారావు , ఎంపీపీ మేనేని స్వర్ణలత- రాజానర్సింగరావు, సర్పంచ్ లు యేలేటి మమత,కవిత స్థానిక ఎంపీటీసీ సామల లక్ష్మణ్ ఉప సర్పంచ్ లింగారెడ్డి,వార్డు సభ్యులు మొగిలి రాకేష్ కాముని శ్రీనివాస్ ధీకొండ చంద్రశేఖర్ ఎంపీడీఓ,స్కూల్ ప్రిన్సిపాల్స్ ,ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.