YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పరిటాల రవి ఆశయాలను కొనసాగిస్తాం

పరిటాల రవి ఆశయాలను కొనసాగిస్తాం

పరిటాల రవి ఆశయాలను కొనసాగిస్తాం
అనంతపురం
దివంగత నేత పరిటాల రవీంద్ర ఆశయాలను తాము నిర్విరామంగా కొనసాగిస్తామని మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర నాయకుడు పరిటాల శ్రీరామ్   పేర్కొన్నారు. మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్ర 63 జయంతి వేడుకలను రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల రవీంద్ర ఘాట్ను పుష్పాలతో అలంకరించారు. అనంతరం పరిటాల కుటుంబ సభ్యులు పరిటాల రవీంద్ర ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కాసేపు పరిటాల ఘాట్ వద్ద ఏకాంతంగా గడిపారు. అనంతరం మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్లు విలేకరులతో మాట్లాడారు. దివంగత పరిటాల రవీంద్ర నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆశయ సాధన కోసం తమ కుటుంబ అహర్నిషలు కృషి చేస్తుందన్నారు. అనంతపురం జిల్లాకు పరిటాల రవీంద్ర చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా హైదరాబాద్ లో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటాపురంలో కోవిడ్ నిబంధనల మేరకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి పరిటాల రవీంద్ర అభిమానులు వెంకటాపురానికి తరలివచ్చి నివాళులర్పించారు.

Related Posts