హుజూరాబాద్ అభ్యర్ధి ఎంపికపై కమిటీ
టీపీసీసీ
హైదరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి పై పార్టీ ముఖ్య నేతలు సుదీర్ఘంగా చర్చించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అభ్యర్థిఎంపిక మాత్రమే కాకుండా, హుజూరాబాద్ లో పార్టీ వ్యూహం పై కూడా చర్చించాం. హుజూరాబాద్ అభ్యర్థి ఎంపిక పై పొన్నం ప్రభాకర్ ,జీవన్ రెడ్డి ,శ్రీధర్ బాబు ల తో కూడిన కమిటీ ఏర్పాటు చేసాం. లోకల్ ,నాన్ లోకల్ అభ్యర్థి ని పెట్టాలా అనే దాని పై చర్చ జరిగింది. ఈ కమిటీ అందరి అభిప్రాయం తీసుకొని ఇంఛార్జ్ ఠాగూర్ కు సెప్టెంబర్ 10లోపు నివేధిక ఇస్తుంది. నివేదిక సూచనల మేరకు అభ్యర్థుల జాబితా ను ఏఐసీసీ కి ఇంఛార్జ్ పంపుతారని అన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆశ్చర్యకరమైన ఫలితం రాబోతుంది. సెప్టెంబర్ 17 లోపు మరో రెండు దలిత గిరిజన ఆత్మగౌరవ సభలు నిర్వహించాలని నిర్ణయించాం..ఈ మీటింగ్ లకు ఏఐసీసీ నేతలను ఆహ్వానిస్తాం. గజ్వేల్ సభ పై క్లారిటీ రాలేదు. సభా స్థలాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. హుజూరాబాద్ లో బీజేపీ ,టిఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారని అయన ఆరోపించారు.