ప్రాణాలను నిలిపేందుకు ఆక్సిజన్ కాన్సట్రేటర్లు
రెడ్ క్రాస్ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్
రెడ్ క్రాస్ సహకారంతో ఆక్సిజన్ కాన్సట్రేటర్లు
ప్రెస్ క్లబ్ కు అందజేత
జగిత్యాల, ఆగస్టు 30
విధి వక్రీకరించి ప్రాణాపాయ స్థితిలోకి చేరిన వారికి అత్యవసరంగా ఆక్సిజన్ అందించేందుకే ఈ మూడు ఆక్సిజన్ కాన్సట్రేటర్లు జగిత్యాల ప్రెస్ క్లబ్ కు అందుబాటులో ఉంచుతున్నామని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్ అన్నారు. సోమవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ కు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కేటాయించిన మూడు ఆక్సిజన్ కాన్సట్రేటర్లు సిరిసిల్ల శ్రీనివాస్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ చైర్మన్, గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్ సారథ్యంలో సమాజ సేవలో నిరంతరం ఉన్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ముందున్నామన్నారు. కరోన సమయంలో ప్రజలకు ఎదో ఒక విధంగా తమ సేవలను అందించాలనే ఆలోచనతో రెడ్ క్రాస్ సొసైటీ ఉందన్నారు. కరోనా సమయంలో ఎందరో ఆక్సిజన్ అందక ఎందరో ప్రాణాలను కోల్పోవడం జరిగిందన్నారు. జగిత్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ రవి, సెక్రెటరీ మంచాల కృష్ణ, ముత్తు, జగదీష్ ఇతర సభ్యులందరం చర్చించి ఇప్పటి వరకు 15 ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, కరోనా నియంత్రణ సామగ్రిని అందజేయడం జరిగిందన్నారు. ఇటీవలే ఓ చిరు ఉద్యొగి సంఘటన నేపద్యంలో మరో మూడు ఆక్సిజన్ కాన్సట్రేటర్లు అవసరమని భావించి రాష్ట్ర సెక్రెటరీ మదన్మోహన్ రావు కు విన్నవించడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. స్వయంగా జగిత్యాలకు వచ్చిన రాష్ట్ర కార్యదర్శి మదన్మోహన్ రావు మూడు ఆక్సిజన్ కాన్సట్రేటర్లు అందజేశారని చెప్పారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు కోరిక మేరకు ప్రెస్ క్లబ్ ద్వారా ఆక్సిజన్ కాన్సట్రేటర్ల సహకారాన్ని ప్రజలకు అందించాలని రెడ్ క్రాస్ సభ్యులు భావించారని శ్రీనివాస్ చెప్పారు. అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ అవసరమైన వారికే వీటి ద్వారా ఉచితంగా సేవలను అందిస్తామని సిరిసిల్ల శ్రీనివాస్ చెప్పారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మా ప్రెస్ క్లబ్ ద్వారా ఆక్సిజన్ కాన్సట్రేటర్ల తో సేవలను అందిస్తామని చెప్పగానే అంగీకరించి అందించిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కష్ట కాలంలో ఆక్సిజన్ అందక ఎందరో మరణించారని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని భావించామని ఇందులో భాగంగానే ప్రెస్ క్లబ్ ద్వారా ఆక్సిజన్ కాన్సట్రేటర్ల ను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ కాన్సట్రేటర్లు అవసరమైన వారు 98491 62111( సిరిసిల్ల శ్రీనివాస్), 94905 30001( బానుక శ్రీనివాస్ ),96186 70108 ( బద్దెనపల్లి మల్లేశం ), 99890 81006 ( ఫజల్ భేగ్ )లను సంప్రదించాలని శ్రీనివాసరావు కోరారు. పాత్రికేయ వృత్తిలో ఉండి సమాజ నిర్మాణంలో బాగ మైన మా ప్రెస్ క్లబ్ పాత్రికేయులందరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఆక్సిజన్ కాన్సట్రేటర్లతో నిరంతరం ప్రాణాలను కాపాడేందుకు సిద్ధంగా సిద్ధంగా ఉంటామని శ్రీనివాసరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సెక్రెటరీ గూడ మల్లారెడ్డి, బి.మల్లేశం, బానుక శ్రీనివాస్, సీహెచ్ వి ప్రభాకర్ రావు, రాజేంద్రశర్మ, శ్రీధర్ రావు, అరిఫోద్దీన్, ఫుజల్ బేగ్, దేవేందర్, లక్ష్మణ్ రెడ్డి, రాజకుమార్, సిగిరి ప్రభాకర్, మహేష్, హైదర్, నరేష్, రాజిరెడ్డి, రాజేష్ గౌడ్, సట్ల శ్రీనివాస్, మదన్, సంపూర్ణాచారితోపాటు పలువురు వున్నారు.