కడప నగరంలో తాగునీటి కష్టాలు
నాలుగు రోజుల నుంచి రవీంద్ర నగర్,అక్కాయపల్లి వాసులకు నీటి సరఫరా లేదు
కడప ఆగస్టు30
కడప నగరంలోనీ రవీంద్ర నగర్, అక్కాయపల్లి ప్రాంతాలలో గత నాలుగు రోజులుగా తాగునీటి కొరకు స్థానిక ప్రజలు కష్టాలకు పడుతున్నారని నీరు ఎప్పుడు వస్తుందోని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందిని ఏఐటీయుసీ నగర కార్యదర్శి కేసి. బాదుల్లా ఆవేదన వ్యక్తంచేశారు.నీటిని సరఫరాకు అమృత్ ఫేజ్-1,ఫేజ్-2 క్రింద నగరంలో 100కోట్ల పనులు ప్రారంభమయ నత్తనడకన నడుస్తున్నాయని పనులు పురోభివృద్ధిపై దృష్టి సారించలన్నారు.
కడప నగర ప్రజల తాగునీటి అవసరాలకు పెన్నానది తప్ప ఇతర ప్రత్యామ్నాయం లేదు. ప్రత్యామ్నాయంగా జలవనరులను అభివృద్ధి చేసే ప్రయత్నము జరగడంలేదన్నారు.
పెన్నాలో పుస్కలంగా నీరున్న మోటర్లు,కరెంటు,పైపులైన్ల లీకేజీల పేరిట నీటిని విడుదల నోచుకోవడం లేదన్నారు.
పాలకమండలి అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజల త్రాగునీటి కష్టాలు తీర్చకపోతే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.