విజయ్ కాంత్ కు ఆనారోగ్యం
చెన్నై, ఆగస్టు 30
డిఫెరెంట్ స్టైల్‌లో సినిమాలు తీయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. ఆయన సినిమాలు అంటేనే అందులో కావాల్సినంత వినోదం ఉంటుంది. ఆయనే తమిళ హీరో విజయకాంత్. సినిమాల్లోనే కాదు ఆయన బయట కూడా విభిన్నంగానే ఉంటారు. ఆయన మాట్లాడే మాటలు, చేతలు ఎన్నో వివాదాలకు దారి తీస్తాయి. అయినప్పటికీ.. తన తీరు మార్చుకోకుండా ముందుకు వెళ్తురు విజయకాంత్. తమిళంతో పాటు పలు డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా విజయ్‌కాంత్ పరిచయమే.ఇక రాజకీయాల విషయానికి వస్తే.. ఆయన తమిళనాడు డీఎండీకే పార్టీ తరపున శాసనసభలో 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకునిగా భాద్యతలను చేపట్టారు. అయితే ప్రస్తుతం ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గత ఏడాది విజయకాంత్ కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఆ తర్వాత ఐసోలేషన్‌లో ఉన్న ఆయన.. త్వరగానే కోలుకున్నారు. తాజాగా మరోసారి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనకు తొలుత చెన్నైలోనే చికిత్స అందించారు. కానీ, ఇక్కడి వైద్య సౌకర్యాలు ఆయనకు వైద్యం ఇచ్చేందుకు సరిపోలేదు.దీంతో ఆయన్ను దుబాయ్‌కి తరలించారు. అక్కడి వైద్యలు ఆయనకు చికిత్స అందించారు. అయితే అంతా మెరుగు పడుతుంది అనుకుంటున్న సమయంలో మరోసారి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయన్ని అమెరికాలోనే ఓ హాస్పిటల్‌కి తీసుకు వెళ్లారు. ఆయనతో పాటు ఆయన రెండో కూమారుుడ షణ్ముగం కూడా ఉన్నారు అని సమాచారం. మొత్తానికి విజయకాంత్ త్వరగా కోలుకోవాలి అని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.