YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ ఎమ్మెల్యేల ఫ్రస్ట్రేషన్

వైసీపీ ఎమ్మెల్యేల ఫ్రస్ట్రేషన్

విజయవాడ, ఆగస్టు 31, 
వైసీపీ అధికారంలో ఉంది. ఎంచక్కా మరో రెండున్నరేళ్ల పాటు అధికారం కూడా చేతిలో ఉంది. హ్యాపీగా దాన్ని అనుభవించాల్సిన ఎమ్మెల్యేలు ఎందుకు తరచూ ఫస్ట్రేషన్ కి గురి అవుతున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఏ ఎమ్మెల్యేను కదిపినా కూడా తెగ చికాకు పడుతున్నారు. జనాల్లోకి రావడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. క్యాడర్ ని కలిసేందుకు కూడా అసలు ఇష్టపడడంలేదు. ఇలా ఎందుకు జరుగుతోంది. వారు ఎందుకు హ్యాపీ మూడ్ లో లేరు అంటే దానికి సవాలక్ష కారణాలే ఉన్నాయి. తరచి చూస్తే వారు ఎందుకొచ్చిన పదవి మాకు అని తెగ బాధపడుతున్నారుట. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఫస్ట్రేషన్ని ఎక్కడా దాచుకోవడంలేదు. ఓపెన్ గానే వారు చెప్పేస్తున్నారు. తాము చాలా టెన్షన్లలో ఉన్నామని, తమను ఇబ్బంది పెట్టవద్దని అటు క్యాడర్ తో పాటు ఇటు అధికారులకు కూడా పదే పదే చెబుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అయితే మమ్మల్ని విలన్లను చేయదలచుకున్నారా అంటూ అధికారులు అవాక్కు అయ్యే బాంబు లాంటి మాటలనే వాడేశారు. ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటూ నిప్పులే చెరిగారు. తాజాగా జరిగిన కార్పోరేషన్ మీటింగులో ఆయన ఇంజనీరింగ్ అధికారుల మీద ఒక్క లెక్కన గుస్సా అయ్యారు. తాము చెప్పిన పనులు ఎందుకు చేయడంలేదు, ఎమ్మెల్యేలు అంటే మరీ అంత చులకనా అంటూ మండిపడ్డారు  కూడా. మీరు పనులు చేయరు, జనాల వద్ద మాత్రం మమ్మల్ని విలన్లుగా చేస్తారంటూ ఆవేశంతో ఊగిపోయారు కూడా.కోలగట్ల అని కాదు కానీ  వైసీపీ ఎమ్మెల్యేలు అందరిదీ దాదాపుగా ఒకే రకమైన ఫీలింగ్ అంటున్నారు. అధికార పార్టీలో ఉన్న వారు అంతా నిరాశతోనే ఉంటున్నారు. ఏ ఒక్క అధికారి తాము చెప్పిన మాట వినడంలేదు. తమకు అసలు గౌరవం లేదు అన్నదే వైసీపీ ఎమ్మెల్యేల ఫీలింగ్. అయితే జనాలు ఎంత కాదనుకున్నా ఎమ్మెల్యే వద్దకు వస్తారు, సమస్యలు చెబుతారు. వాటిని తీర్చమని కూడా కోరతారు. ఆ పని మీద అధికారులకు ఫోన్లు చేసినా కలసినా కూడా వారి నుంచి సరైన రెస్పాన్స్ లేకుండా పోతోందని వైసీపీలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. కోలగట్ల తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు ఇలాగే తరచూ ఆవేశానికి గురి అవుతున్నారు.ఎమ్మెల్యేలు అయితే ఏమో రాజ భోగం పడుతుంది అనుకున్నాం, కానీ అసలు ఏమీ పనులు జరగడంలేదు. చూస్తూండగానే సగం పాలన ముగిసింది. ఇక మిగిలింది కూడా ఇలాగే సాగిపోతుంది. మళ్ళీ జనాల వద్దకు వెళ్ళి ఓట్లు ఎలా అడుగుతాం అన్నదే వైసీపీ ఎమ్మెల్యేలకు పట్టుకున్న బెంగగా ఉంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. దాంతో నిధులు ఏవీ రావడంలేదు. ఎమ్మెల్యేలకు ప్రతీ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు ఇస్తామని సీఎం అయిన తొలినాళ్ళలో జగన్ చెప్పుకొచ్చారు. కానీ అది ఆచరణలో ఎక్కడా అమలు కావడంలేదు. ఇక చిన్న పని దగ్గర నుంచి కూడా చేయించుకోలేని దుస్థితి. దాంతోనే ఎమ్మెల్యేలకు బీపీ పెరిగిపోతోంది అంటున్నారు. మరో వైపు ఎమ్మెల్యే కావడానికి చేసిన అప్పులకు వడ్డీలు పేరుకుపోయి ఉన్నాయి. వాటిని చూసుకుని కూడా ఎమ్మెల్యేలు తరచూ ఆగ్రహానికి గురి అవుతున్నారని అంటున్నారు. మరి వారి బాధను ఎవరు తీరుస్తారు అంటే జవాబు కష్టమే.

Related Posts