YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తండ్రి, కొడుకుల ఆశలు

తండ్రి, కొడుకుల ఆశలు

కాకినాడ, ఆగస్టు 31,
గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు అధికార వైసీపీలోకి జంప్ చేసిన విషయం తెలిసిందే. అలాగే పలువురు నేతలు పూర్తిగా సైలెంట్ అయ్యారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది. ఇప్పటికే అధికార వైసీపీపై వ్యతిరేకత మొదలవుతోంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో రెండేళ్లుగా పూర్తి సైలెంట్‌గా ఉన్న టీడీపీ నేతలు యాక్టివ్ అవుతున్నారు. అలాగే ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు చంద్రబాబు, ఇంచార్జ్‌లని పెట్టే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్‌చార్జ్‌లు లేని, ఇన్‌చార్జ్‌లు యాక్టివ్‌గా లేని చోట్ల కొత్త ఇన్‌చార్జ్‌ల‌ను పెట్టే ప్రక్రియ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదే సమయంలో కాకినాడ పార్లమెంట్ సీటు సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ వారసుడు నవీన్‌కు ఇవ్వొచ్చని తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరుపున చలమలశెట్టి సునీల్ పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఓడిపోయాక సునీల్ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో కాకినాడ పార్లమెంట్ స్థానంలో టీడీపీకి నాయకుడు లేరు. అయితే కాకినాడ పార్లమెంట‌రీ జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా నవీన్ పనిచేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో యాక్టివ్‌గా ఉంటూ, ఏడు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు.పార్లమెంట్ పరిధిలో తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ సిటీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో పెద్దాపురం మినహా మిగిలిన అన్నీ స్థానాల్లో టీడీపీ ఓడిపోయింది. అయితే ఇప్పుడు ఆ స్థానాల్లో ఇంచార్జ్‌లతో కలిసి నవీన్, పార్టీని వైసీపీకి ధీటుగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడు చోట్ల టీడీపీ పరిస్థితి మెరుగైనట్లు తెలుస్తోంది. జ‌గ్గంపేట‌, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండేళ్లలోనే మార్పు క‌నిపిస్తోంది. జ్యోతుల ఫ్యామిలీ సొంత నియోజకవర్గం జగ్గంపేట కూడా కాకినాడ పార్లమెంట్ పరిధిలోనే ఉంది. ఇక వ‌చ్చే ఎన్నికల్లో న‌వీన్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. జిల్లా రాజ‌కీయాల్లో న‌వీన్ ఎంపీ బ‌రిలోనే ఉంటార‌ని ఓ ప్రచారం అయితే జ‌రుగుతోంది. చంద్రబాబు సైతం న‌వీన్‌ను ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాల‌ని సంకేతాలు ఇచ్చిన‌ట్టు కూడా టీడీపీ నేత‌లే చెపుతున్నారు. అయితే జ‌గ్గంపేట బ‌రిలో నెహ్రూ ఉంటే.. కాకినాడ నుంచి న‌వీన్ ఉంటారు. జ‌గ్గంపేట‌ను వ‌దులుకునేందుకు వీరు సిద్ధంగా లేన‌ట్టు టాక్ ? మ‌రి బాబు ఈ తండ్రి కొడుకుల‌కు రెండు సీట్లు ఇస్తారా ? అన్నది కూడా చూడాలి

Related Posts