YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఫిజికల్ క్లాసులుపై మీ మాంస

ఫిజికల్ క్లాసులుపై మీ మాంస

హైదరాబాద్, ఆగస్టు 31, 
ఫిజికల్ తరగతులు ప్రారంభమవుతున్న క్రమంలో కొందరు తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపించేందుకు సంకోచిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత పదిరోజుల పాటు పరిస్థితులను గమనించి నిర్ణయాలు తీసుకుందామని ఆలోచిస్తున్నారు. మరో వైపు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పేరెంట్స్‌కు వరసపెట్టి ఫోన్లు చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభించకముందే ఫీజులు చెల్లించాలని ఒత్తిళ్లు చేస్తున్నారు. వీటితో పాటు పిల్లలను స్కూళ్‌కు పంపించాలనే తల్లిదండ్రుల అంగీకార పత్రం తప్పనిసరని షరతులు విధిస్తున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థులను ధైర్యంగా పాఠశాలకు పంపించండని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. పాఠశాలలలో ఎలాంటి కోవిడ్ నిబంధనలు ఏర్పాట్లు చేస్తారన్న అంశాలు ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో సంకోచిస్తున్నారు. విద్యాసంస్థలలో కోవిడ్ నిబంధనలు ఏ మేరకు పాటిస్తారు, భౌతికదూరం సాధ్యమేనా, అనే అనుమానాలు తల్లిదండ్రులను వెంటాడుతున్నాయి. హైస్కూళ్ విద్యార్థులను పాఠశాలకు పంపించేందుకు సుముఖత చూపుతున్నాకని ప్రైమరీ స్కూళ్ విద్యార్థుల విషయంలో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభించిన తరువాత 10 రోజుల పాటు పరిస్థితులను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ప్రైవేటు స్కూళ్ల నుంచి తల్లిదండ్రులకు వరసపెట్టి ఫోన్లు వస్తున్నాయి. విద్యార్థులను పాఠశాలకు పంపించాలని, తరగతుల ప్రారంభానికి ముందే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. విద్యార్థులను పంపిస్తున్నారా లేదా.. అనే అంశాలను స్పష్టత నివ్వాలని కోరుతున్నారు. పాఠశాలకు విద్యార్థులను అనుమతించాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు విద్యార్థులు అంగీకార పత్రం అందించాలని నిబంధనలు విధిస్తున్నారు. తమ పిల్లల ఆరోగ్యానికి సంబంధించి పూర్తి బాధ్యత తమదేనని స్పష్టం చేస్తూ అంగీకరించాలని షరతులు విధిస్తున్నారు.ఫిజికల్ తరగతుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతోంది. వైరస్ నుంచి విద్యార్థులను కాపాడేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలను, విధివిధానాలను ప్రకటిస్తాం. పిల్లలను ధైర్యంగా పాఠశాలలకు పంపించండి. ఆరోగ్యశాఖ సూచనలతో కరోనా పరిస్ధితులను అంచనా వేసి ప్రభుత్వం ఫిజికల్ తరగతులపై నిర్ణయం తీసుకుంది. పాఠశాలల ప్రారంభం తరువాత ఎదురయ్యే సమస్యలను గుర్తించి వెంటనే పరిశ్కరించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.

Related Posts