YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చర్చనీయంగా మారిన ఆర్కిలయాజి లెటర్

చర్చనీయంగా మారిన ఆర్కిలయాజి లెటర్

టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలు, పురాతన కట్టడాల వివరాలివ్వాలంటూ కేంద్ర పురావస్తుశాఖ టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు లేఖరాయడం చర్చనీయాంశంగా మారింది. టీటీడీ పరిధిలో తిరుమలలో ఉన్న అన్ని ఆలయాలను తన పరిదిలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆలయాలంటిని రక్షిత కట్టడాల పరిధిలో చేర్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది. ఆయా దేవాలయాలను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు.. కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ పంపింది. నిజంగానే రక్షిత కట్టడాలుగా ప్రకటిస్తే కేంద్రం చేతిలోకి టీటీడీ వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టరేట్ నుంచి... విజయవాడలోని అమరావతి సర్కిల్‌కు ఆదేశాలు అందాయి. కేంద్ర ఆదేశాల మేరకు టీటీడీకి అమరావతి సర్కిల్‌ లేఖ పంపింది.తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని, పురాతన కట్టడాలు తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని పలు ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర పురావస్తు శాఖ చెబుతోంది. భక్తులు ఇచ్చిన కానుకలు సరిగా భద్రపరచడం లేదనే ఫిర్యాదుల వస్తున్నాయట. పూర్వకాలంలో రాజులు ఇచ్చిన ఆభరణాలు భద్రతకు నోచుకోలేదని పురావస్తు శాఖ చెబుతోంది. త్వరలో పురావస్తు శాఖ అధికారులు తిరుమలను సందర్శించనున్నారుపురాతన కట్టడాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని, పూర్వకాలంలో రాజులు ఇచ్చిన విలువైన ఆభరణాలు, భక్తులు సమర్పిస్తున్న కానుకలకు సరైన భద్రత కల్పించడంలేదని ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. వీటిపై స్పందించిన కేంద్రం పరిశీలించి నివేదిక సమర్పించాలని పురావస్తుశాఖను ఆదేశించింది. దీంతో తిరుమలలో ఉన్న పురాతన ఆలయాలు, భవనాల వివరాలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కేంద్ర పురావస్తు శాఖ తితిదేను కోరింది. ఈ మేరకు అమరావతిలో ఉన్న పురావస్తు శాఖ ప్రాంతీయ కార్యాలయం తితిదే ఈవోకు లేఖ రాసింది. అమరావతి ప్రాంతీయ కార్యాలయం ద్వారా టీటీడీకు పంపిన లేఖపై అధికారులు పూర్తిగా స్పందించడంలేదు. లేఖ రాసినట్టు తమకు సమాచారం ఉంది గానీ దాన్ని పూర్తిగా పరిశీలించాకే తాము నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. కేంద్ర పురావస్తు శాఖ తితిదే పరిధిలోని తిరుమలలో ఉన్న ఆలయాలను పరిశీలించేందుకు ఓ బృందం వస్తోందన్న సమాచారం ఉందన్నారు. ఈ లేఖను అన్ని కోణాల్లోనూ పూర్తిగా పరిశీలించాకే ప్రత్యుత్తరం రాస్తామని పేర్కొంటున్నారు. తితిదే ఆలయాలు, భవనాలు పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్తే.. భక్తులకు అవసరమైన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ఆటంకం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts