YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీ కాంగ్రెస్ నేతలు తర్జనభర్జన

టీ కాంగ్రెస్ నేతలు తర్జనభర్జన

హైదరాబాద్, ఆగస్టు 31, 
హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక పై టీ కాంగ్రెస్ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.ఇప్పటికే అభ్యర్థి ఎంపిక కు ఓక కమిటీ వేసిన పీసీసీ... ఇప్పుడు ఇద్దరు సభ్యులతో కూడిన మరో కమిటీ కి అభ్యర్థి ఎంపిక భాధ్యతను అప్పగించింది..మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కొండంత రాగం తీసి ఏదో పాడినట్లు ఉంది కాంగ్రెస్ పరిస్థితి...మరోవైపు దలిత, గిరిజన సభల విషయం నూ కన్ఫ్యూజన్. గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం హాట్ హాట్ గా సాగింది.. ఈ మీటింగ్ లో హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి తో పాటు ,దలిత, గిరిజన ఆత్మ గౌరవ సభల పై చర్చ జరిగింది.సమావేశంలో ఎక్కువ సేపు హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి పైనే చర్చ జరిగినప్పటికీ  అభ్యర్థి విషయంలో క్లారిటీ రాకుండా నే సమావేశం ముగిసింది.. ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక భాధ్యతను ఇప్పటికే దామోదర రాజనర్సింహ కు అప్పగించినప్పటికీ ఓ క్లారిటీ రాకపోవడంతో ఈసారి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ,దామోదర రాజనర్సింహ లకు ఈ బాధ్యత అప్పగించారు.కరీంనగర్ జిల్లా పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు ,పొన్నం ప్రభాకర్ ,జీవన్ రెడ్డి ల అభిప్రాయం తీసుకుని భట్టి ,దామోదర లు సెప్టెంబర్ 10లోపు అభ్యర్థుల నివేధికను ఇంఛార్జ్ ఠాగూర్ కు ఇవ్వాలని పార్టీ సీనియర్లు నిర్ణయించారు.. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో లోకల్ ,నాన్ లోకల్ అంశం తెరపైకి వచ్చినట్లు సమాచారం.. నాన్ లోకల్ క్యాండిడెట్ వద్దనుకుంటె కోండా సురేఖ పేరు పక్కకు పోయే అవకాశం ఉంది..పార్టీ స్థానిక నేతల అభిప్రాయం తీసుకున్నాకే హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ని కరారు చేయనున్నట్లు ఇంఛార్జ్ పార్టీ నేతలతో అన్నట్లు సమాచారం. ఆగస్ట్ 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు దలిత గిరిజన సభలకు ప్లాన్ చేసింది కాంగ్రెస్.ఇప్పటికే ఇంధ్రవెళ్ళి ,ర్యావిరాల లలో రెండు  సభలు ,మూడు చింతలపల్లి లలో ఓక దీక్ష ను కూడా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు.అయితే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓక సభ చొప్పున 17 సభ్యులు నిర్వహించాలనుకున్నప్పటికీ పార్టీ నేతల సహాకరించకపోవడంతో ఈ సభలు మరో రెండు నిర్వహించే అవకాశం ఉంది..అది కూడా సెప్టెంబర్ 17 న వరంగల్ సభ కరారైనప్పటికీ..మరో సభ ఎక్కడ నిర్వహించాలో తెలియని పరిస్థితి. గజ్వేల్ ,హుజూరాబాద్ లో సభ నిర్వహించాలని ప్లాన్ చేసారు.. పీసీసీ అధ్యక్షుడు ఏకంగా గజ్వేల్ కు వస్తా ఎలా ఆపుతావో చూస్తా అని సీఎం కు సవాల్ కూడా చేసారు.. ఇప్పుడు తీరా పార్టీ నేతలు సహాకరించకపోవడంతో అవి క్యాన్సిల్ అయ్యాయి.మొత్తానికి కాంగ్రెస్ పరిస్థితి ఓక్క  అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు తయారయింది...ప్రకటించిన సభలు  క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి , హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక వాయిదా వేసే పరిస్థితి కాంగ్రెస్ కు ఏర్పడింది.కొత్త పీసీసీ వచ్చినా పరిస్థితి మారకపోవడం పై కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Related Posts