YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

తెలంగాణలో స్కూళ్ల ప్రారంభం వాయిదా

తెలంగాణలో స్కూళ్ల ప్రారంభం వాయిదా

హైదరాబాద్
తెలంగాణలో స్కూళ్ల ప్రారంభం వాయిదా పడింది. మంగళవారం నాడు స్కూళ్ల పునఃప్రారంభంపై దాఖలైనపిటిషన్‌పై హైకోర్టు  విచారణ చేపట్టింది.   బుధవారం ( సెప్టెంబర్‌ 1వ తేదీ) నుంచి స్కూళ్లను తెరవాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై వారం రోజుల పాటు స్టే విధించింది. నాలుగు వారాలకు కౌంటర్‌దాఖలు చేయాలని ఆదేశించింది. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను పున: ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కేసులు తగ్గకపోయినా పాఠశాలలను రీ ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. కరోనా ఇంకా నియంత్రణలోకి రాలేదు. మరోవైపు, చిన్నపిల్లలను పాఠశాలకు పంపే ముందు తల్లిదండ్రులు అండర్ టేకింగ్ ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  కోవిడ్ టీకా కార్యక్రమం పూర్తి కాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.. అది డిసెంబర్‌లో పూర్తి చేస్తారని అలాంటప్పుడు ఏవిధంగా వ్యాక్సిన్ లేకుండా పాఠశాలలకు ప్రవేశాన్ని అనుమతి ఇస్తున్నారని హైకోర్టు నిలదీసింది. ఒకవేళ స్కూళ్లలో ఉన్న పిల్లలకు ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించింది. వాదనల తర్వాత వారం రోజుల పాటు స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై స్టే విధించింది హైకోర్టు. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై పిల్లలను బలవంతం చేయవద్దని హైకోర్టు సూచించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రెసిడెన్షియల్ హాస్టళ్లు కూడా తెరవొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. పేరెంట్స్, మేనేజ్‌మెంట్లపై ఒత్తిడి తీసుకురావద్దు. అలాగే, విద్యార్ధుల తల్లిదండ్రులనుంచి ఎలాంటి రాతపూర్వక హామీలు తీసుకోవద్దని ఆదేశించింది. . 

Related Posts