YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఇస్రోలో ఆదానీ

ఇస్రోలో ఆదానీ

నెల్లూరు, సెప్టెంబర్  1, 
అంతరిక్ష శాస్త్ర, సాంకేతిక పరిశోధన రంగంలో అగ్రదేశాలకు తీసిపోకుండా సేవలందిస్తోన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)ను మోడీ ప్రభుత్వం ప్రయివేటీకరిస్తోంది. ఇందుకోసం తొలుత పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్స్‌ (పిఎస్‌ఎల్‌వి) తయారీ ప్రక్రియను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికి ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటి వరకు అంతరిక్ష పరిశోధనలను ఇస్రో స్వయంగా నిర్వహిస్తూ వస్తోంది. కేంద్రం పిఎస్‌ఎల్‌వి తయారీ పనులను అతి త్వరలోనే కార్పొరేట్లకు అప్పగించనుంది. పిఎస్‌ఎల్‌వి తయారీ కాంట్రాక్టును పొందడానికి అదానీ గ్రూపు, ఎల్‌అండ్‌టి గ్రూపు లాంటి బడా కార్పొరేట్లు పోటీ పడుతున్నాయి. ఈ రెండు సంస్థలు వేరు వేరు కన్సారియంలుగా ఏర్పాడి ఆసక్తి బిడ్లను దాఖలు చేశాయి. వీటితో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(భెల్‌) ఏకైకా కంపెనీగా బిడ్స్‌ను దాఖలు చేసింది. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా పిఎస్‌ఎల్‌వి కాంట్రాక్టును పొందడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎల్‌అండ్‌టి సారధ్యంలోని కన్సార్టియంలో హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఉందని సమాచారం.ఈ బిడ్లన్నీ కూడా టెక్నోాకమర్షియల్‌ గణింపు కింద ఉన్నాయని న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధాకఅష్ణన్‌ పేర్కొన్నారు. మూల్యాంకనం పూర్తయిన తర్వాత అర్హత సాధించిన కన్సార్షియాన్ని ఎంపిక చేసి పిఎస్‌ఎల్‌వి తయారీ కాంట్రాక్ట్‌ పనులను అప్పగిస్తామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత నెల 30 నాటికి అదాని గ్రూప్‌, ఎల్‌ అండ్‌టి, భెల్‌ నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్‌ దాఖలయ్యాయి. ఇస్రో దాదాపుగా 150 చిన్న, పెద్ద సంస్థలతో కలిసి పని చేస్తున్నప్పటికీ.. పిఎస్‌ఎల్‌వి తయారీ ప్రక్రియ పూర్తిగా ప్రయివేటుపరం కావడం ఇదే తొలిసారి కానుంది. దీంతో ప్రధాని మోడీ అత్యంత సన్నిహితుడిగా పేరున్న కార్పొరేట్‌ దిగ్గజం గౌతం అదానీ ఇక అంతరిక్ష పరిశోధనల రంగంలోకి అడుగుపెట్టనున్నారని స్పష్టం అవుతోంది.ప్రభుత్వ రంగ సంస్థల విక్రయ ప్రక్రియలో భాగంగా ఇస్రోను కూడా ప్రయివేటుకు అప్పగించడానికి ఇది తొలి దశ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇస్రోను సైతం కార్పొరేట్ల దాహానికి అప్పగించడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇస్త్రో శాస్త్రవేత్తలు 1993లో తొలి సారి పిఎస్‌ఎల్‌విని ప్రయోగించారు. 25 ఏళ్లలో దాదాపుగా 50 మిషన్లను నింగిలోకి పంపారు. 2019-20లో ఎన్‌ఎస్‌ఐఎల్‌ రూ.300 కోట్ల రెవెన్యూ ఆర్జించగా.. గడిచిన ఆర్థిక సంవత్సరంలోనూ అంత కంటే ఎక్కువ మొత్తమే ఆదాయాన్ని పొందిందని సమాచారం.

Related Posts