కర్ణాటక రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈరోజు ఉదయం తుమకూరులో నిర్వహించిన ఓ బహిరంగసభకు ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవినీతి, నల్లధనంపై ఉన్న ఆసక్తి రాష్ట్రాభివృద్ధిపై లేదని అన్నారు. తుమకూరు ప్రాంతంలో హేమావతి నది ప్రవహిస్తున్నప్పటికీ ఇక్కడి వాసులకు తాగునీటి కష్టాలు తప్పట్లేదని, తాగునీటిని సరఫరా చేసే విషయంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు రెండూ తోడుదొంగలని, ప్రజలను మభ్య పెట్టేందుకు ఆ రెండు పార్టీలు చూస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నప్పటికీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో బహిరంగ సభలో ప్రసంగించారుబీజేపీ అధికారంలోకి వస్తేనే కర్ణాటకలో అభివృద్ధి సాధ్యమవుతుందని.. తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను మోదీ కోరారు. జీ ప్రధాన మంత్రి దేవెగౌడ నేతృత్వంలోని జనతా దళ్ (సెక్యులర్ - జేడీఎస్)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన బీజేపీ గెలుపు కోసం తుమకూరులో ప్రచారం చేశారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ ఈ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కాపాడేందుకు జేడీఎస్ పని చేస్తోందని దుయ్యబట్టారు. కర్ణాటకలో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ మాత్రమే ఏర్పాటు చేయగలదన్నారు.కాంగ్రెస్‌ను జేడీఎస్ ఓడించలేదని పోల్ సర్వేలు, రాజకీయ పండితులు సహా అందరూ చెప్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా మార్చగలరా? అంటేఒక్క బీజేపీ మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్‌ను ఎవరైనా కాపాడుతున్నారా? అంటే అది కేవలం జేడీఎస్ మాత్రమేనని తెలిపారు. జేడీఎస్‌తో రహస్య అవగాహన ఉందో, లేదో కాంగ్రెస్ స్పష్టం చేయాలన్నారు. ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారని నిలదీశారు. ప్రజలకు నిజం చెప్పే ధైర్యం కాంగ్రెస్‌కు ఉండాలన్నారు.గత సంవత్సరం జరిగిన బెంగళూరు మేయర్ ఎన్నికలను ప్రస్తావించారు. మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ రహస్య పొత్తు పెట్టుకున్నాయన్నారు. కర్ణాటకలో కొన్ని చోట్ల ఈ రెండు పార్టీలు ఘర్షణ పడుతున్నట్లు నటిస్తాయని, బెంగళూరులో మాత్రం కాంగ్రెస్ మేయర్‌కి జేడీఎస్ మద్దతిస్తోందని అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటని నిలదీశారు. అయితే తనకు మాజీ ప్రధాని దేవెగౌడ అంటే ఇప్పటికీ చాలా గౌరవం ఉందన్నారు.