వరంగల్
వ్యాపార లావాదేవీలలో వచ్చని తేడాలు ముగ్గురి మరణాలకు దారి తీసాయి. సొంత తమ్ముడే అన్నను మరో ఇద్దరితో కడతేర్చాడు. మృతుడు చాంద్ పాషా సొంత తమ్ముడు ఎండి షఫీ బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తొమ్మిది మంది వ్యక్తులతో వచ్చి ఇంటి తలుపులను పగలగొట్టి గాఢనిద్రలో ఉన్న కుటుంబ సభ్యులపై వేటకొడవళ్లతో అతి కిరాతకంగా దాడి చేసి పారిపోయాడు. సంఘటన స్థలంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా కుటుంబ సభ్యులు పోలీసుల సహాయంతో మరో ఇద్దరిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు చాంద్ పాషా (50), ఖలీల్ (40), సబీరా (42). సమద్ (24), ఫహాద్ (26)లకు తీవ్రగాయలయ్యాయి.