నాగరిక సమాజంలో బతికేటప్పుడు మనుషులకు భయం కూడా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తప్పు చేస్తే బతకలేం అనే భయం ఉన్నప్పుడే దాచేపల్లి అత్యాచారం లాంటి ఘటనలు జరగవని ఆయన తెలిపారు. శనివారం గుంటూరు ఆస్పత్రిలో దాచేపల్లి బాధితురాలిని పరామర్శించారు. దాచేపల్లి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇలాంటి ఘటనలు ఇకపై జరగడానికి వీల్లేదని ఆయన తెలిపారు. ఇలాంటి తప్పులు చేసేవారికి ఈ భూమ్మిద అదే చివరి రోజు అవుతుందని ఆయన హెచ్చరించారు. అలాంటి నీచులకు రాష్ట్రంలో నివసించే హక్కులేదని పునరుద్ఘాటించారు.మనిషి ఒక మృగంలా బతకడానికి వీల్లేదని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.దాచేపల్లి ఘటన చాలా బాధాకరం, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై నాగరిక ప్రపంచం సిగ్గుపడాలని, రాష్ట్రానికి సందేశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తప్పు చేసిన వాడు తప్పించుకోకుండా కఠినంగా శిక్ష పడేలా చేస్తామని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలపై రాజకీయాలు చేయడం దారుణమంటూ పరోక్షంగా వైసీపీపై మండిపడ్డారు. దారుణ సంఘటన నేపథ్యంలో ప్రజలు కూడా చైతన్యంతో వ్యవహరించాలని కోరారు. చేపల్లిలో జరిగిన దుర్ఘటన మానవత్వానికే మాయని మచ్చ అని, ఆంబోతులు మాదిరి బజారునపడితే సహించేదిలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం పనితీరుకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయనే భయం రావాలని, ఫోక్సో చట్టంలో సవరించిన నిబంధనలపై చైతన్యపరచాలని, ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తారని, నిందితులు ఏ స్థాయివారైనా సహించేది లేదని చంద్రబాబు అన్నారుబాధితురాలికి సంఘీ భావంగా సోమవారం ప్రతి మండలంలో ర్యాలీ నిర్వహిస్తామని, ‘ఆడబిడ్డకు రక్షణగా నిలుద్దాం’ అంటూ నిర్వహించే ఈ ర్యాలీలో అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు.