YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీపీఎస్ రద్దు కొరకు జనసంద్రమైన నెల్లూరు నగరం  -ఫ్యాఫ్టో-ఎపీసీపీఎస్ యుఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

సీపీఎస్ రద్దు కొరకు జనసంద్రమైన నెల్లూరు నగరం  -ఫ్యాఫ్టో-ఎపీసీపీఎస్ యుఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

సీపీఎస్ రద్దు కొరకు జనసంద్రమైన నెల్లూరు నగరం
 -ఫ్యాఫ్టో-ఎపీసీపీఎస్ యుఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
మద్దతు ప్రకటించిన ఏపీఎన్జీవోలు
నెల్లూరు
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ బుధవారం l నెల్లూరు నగరం నందు ఫ్యాఫ్టో-ఎపీసీపీఎస్ యుఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా బైక్ ర్యాలీ మరియు బారీ బహిరంగ సభకు ఉద్యోగులు,ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నెల్లూరు నగరం జనసంద్రాన్ని తలపించింది.ఈసందర్భంగా జిల్లా ఫ్యాప్టో చైర్మన్ తాళ్లూరు శ్రీనివాసులు మాట్లాడుతూ పెన్షన్ భారాన్ని తగ్గించుకు నేందుకు ఉద్యోగులు,ఉపాధ్యాయుల పైకాన్ని పెట్టుబడుదారులకు అందుబాటులో ఉంచడానికి, ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం, ఈదుర్మార్గమైన,ఉద్యోగుల ఆర్థిక అస్తిత్వాన్ని బలహీన పరిచే  కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలులోకి తెచ్చిందని ఆవేదన వ్యక్తపరిచారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఈ నూతన పెన్షన్ విధానాన్ని అనుసరిస్తుందని,అందువల్ల పదవీ విరమణ అనంతరం వర్తించే పెన్షన్, గ్రాట్యుటీ,కమ్యూటేషన్ లాంటి ఆర్థిక భద్రత ఉద్యోగులు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.ఈ విధానం ద్వారా ఉద్యోగులు నెల నెలా తమ జీతాల నుంచి దాచుకునే డబ్బును షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రభుత్వాలు ఉద్యోగుల జీవితాలతో చదరంగం ఆడుతున్నారని ,ఇకనైనా ఈ చదరంగాన్ని ఆపి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నానమని తెలిపారు.నాడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి  తన పాదయాత్ర సందర్భంగా తమ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులలోనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ,పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానన్న హామీని నేడు ముఖ్యమంత్రిగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. అనంతరం  సెక్రటరీ జనరల్ హజరత్  మాట్లాడుతూ అన్నా!సీపీఎస్ ను మనం అధికారంలోకి వచ్చిన వారంలో రద్దు చేస్తాను.దాన్ని గురించి పక్కనబెట్టు,ప్రతీ ఉద్యోగస్థుడికీ నేనివాళ చెబుతున్నాను,మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తాను అని వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.  రాష్ట్రంలోని ,1లక్షా 84 వేల కుటుంబాలలో వెలుగులు నింపాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ర్టఫ్యాఫ్టో పూర్వపు చైర్మన్ బాబు రెడ్డి  మాట్లాడుతూ ఇకనైనా కమిటీలతో కాలయాపన చేయకుండా వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలనే ఏకైక డిమాండ్ తో ఈ కార్యక్రమం నిర్వస్తున్నామని సీపీఎస్ రద్దు చేస్తారనే ఆశతోనే ఉద్యోగులు,ఉపాధ్యాయులు మొన్నటి ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి కి భారీ ఎత్తున గంపగుత్తగా ఓట్లు వేశారని కానీ , ఊరించి ఇలా ఉసూరు మనిపించటం బావ్యం కాదని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్జీవో నెల్లూరు జిల్లా అధ్యక్షులు పెంచలరావు  మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి సీపీఎస్ రద్దు చేయకపోతే చరిత్ర తిరగరాయాల్సి వస్తుందని ,కావున ప్రభుత్వం వెంటనే సీపీఎస్ రద్దు దిశగా అడుగులు వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫ్యాఫ్టో నాయకులు చిరంజీవి మాట్లాడుతూ ఒడిదుడుకులతో సాగే షేర్ మార్కెట్ నందు ఉద్యోగులు,ఉపాధ్యాయుల పెన్షన్ విధానాన్ని ముడిపెట్టి మమ్మల్ని టెన్షన్ పెట్టొద్దని ప్రభుత్వాన్ని కోరారు.కో చైర్మన్ మురళీధర్ మాట్లాడుతూ ఇటీవల సీపీఎస్ ఉద్యోగులు రిటైర్ అయిన తరువాత వారికి అందుతున్న పెన్షన్ దినసరి కూలీల కంటే కూడా తక్కువగా అందుతుందని ఇది చాలా బాధాకరమైన విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటి సెక్రటరీ జనరల్ రమేష్ మాట్లాడుతూ సీపీఎస్ విధానంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు,ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ తరువాత వర్తించే కరువు భత్యం,పీఆర్సీ పెంపు,హెల్త్ కార్డులు, మెడికల్ రీయింబర్స్మెంట్ మొదలయిన సదుపాయాలు అన్నీ దూరమై పోతాయని చెప్పారు.సదరు సమావేశంలో జిల్లా ఫ్యాఫ్టో భాగస్వామ్య సంఘాల నాయకులు శేషులు,రాజమనోహర్,దశరధ రాములు,సురేందర్ రెడ్డి, మాల్యాద్రి,ఎన్జీవో నాయకులు వెంకట స్వామి,కిరణ్,రాజేంద్ర పెంచలయ్య, గిరి,వర్మ,వెంకట్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.తదనతంరం కలెక్టర్ కార్యాలయ పాలనాధికారి సుబ్రహ్మణ్యం కి వినతిపత్రం సమర్పించారు.

Related Posts