YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మీ ఓటు ఎటు వైపు రూపాయి బొట్టుబిల్లకా.. రూ.2016 ....ఆసరా పెన్షన్ కా  ?

మీ ఓటు ఎటు వైపు రూపాయి బొట్టుబిల్లకా.. రూ.2016 ....ఆసరా పెన్షన్ కా  ?

మీ ఓటు ఎటు వైపు
రూపాయి బొట్టుబిల్లకా.. రూ.2016 ....ఆసరా పెన్షన్ కా  ?
మీ ఓటు ఎటు వైపు..60 రూ. గడియారానికా.. కేసీఆర్ కిట్కా. ?
హుజూరాబాద్ దమ్మక్కపేట గ్రామస్థులతో ఆర్థిక మంత్రి హరీశ్ రావు
హుజురాబాద్
దమ్మక్కపేటలో యాదవ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు బుధవారం శంకుస్థాపన చేసారు. తరువాత మంత్రి మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం చేసే రైతుకు సాయం చేసిన ఏకైక సీఎం కేసీఆరే. నీటి పన్ను, భూమి శిస్తు రద్దు చేసి రైతుకే పన్ను కడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుకు భరోసా ఇచ్చింది తెరాస కేసీఆరే. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ హయాంలో ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లుకాలిపోయే పరిస్థితి. కాళేశ్వరం కట్టక ముందు రైతులు సాగు నీటివిడుదల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. కాళేశ్వరం పూర్తయ్యాక కాలువలనిండా నీరే. ఇంక నీళ్లు వద్దని రైతులు చెప్పే పరిస్థితి వచ్చింది. కాలంతో పని లేకుండా రెండు పంటలకు నీరు ఇస్తున్నామని అన్నారు.
కరోనా కష్ట కాలంలోను రైతుకు రైతు బంధు ఇచ్చాం. 25  వేలలోపు రుణాలు మాఫీ చేశాం. ఇప్పుడు 50వేలలోపు రుణాలు మాఫీ చేస్తున్నాం. వచ్చే ఏడాది లక్ష రూపాయల లోపు రైతు రుణాలన్నీ వడ్డీతోసహ మాఫీ. కరోనీ కాలంలో ప్రజలకు బియ్యం, పప్పులు వంటి వాటి పంపిణీ కోసం  2500కోట్లు, కరోనా మందులు, ఆక్సిజన్ వంటి వాటికోసం వేయి కోట్లు ఖర్చు చేశాం. హుజూరాబాద్ ప్రజలు ఇళ్లు అడుగుతున్నారు. త్రిగా ఈటల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఇళ్లు పూర్తి కాలేదు. మంత్రులకు సీఎం కేసీఆర్ 4 వేల ఇళ్లు మంజూరు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా 5 వేల ఇళ్లు కట్టారు. నేను 3600 ఇళ్లు కట్టాను. శ్రీనివాస్ గౌడ్ 3300ఇళ్లుకట్టారు.  మీ పక్క ఎమ్మెల్యే  ధర్మారెడ్డి 850ఇళ్లు కట్టారు.
ఇళ్లు కట్టించని మంత్రి రాజేందర్. మీకు ఇళ్లు తప్పకుండా కట్టిస్తాం. సొంత జాగా ఉన్న వాళ్లకు కట్టిస్తాం. కట్టిన ఇళ్లను,ఇళ్లు లేక కిరాయికి ఉండే వారికి ఇస్తాం. మీరు ఆలోచించాలి.  మంత్రిగా ఒక్క ఇళ్లు కట్టని ఈటల రాదేందర్, ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఏ పని అయినా చేస్తాడా..?  ఓ వ్యక్తి లాభం కావాలా...హుజూరాబాద్ ప్రజల లాభం కావాలా.. మీ ఓటు ఎటు వైపు... ఈటల పంచే బొట్టు బిల్లకా...కేసీఆరే ఇచ్చే 2016 ఆసరా పెన్షన్ కా.. ? మీ ఓటు ఎటు వైపు..60 రూ. గడియారానికా.. కేసీఆర్ కిట్కా. ? మేం కాళేశ్వరం ప్రాజెక్టుకడిత్ బీజేపీ వాళ్లు బీఎస్ఎన్ ఎల్, రైల్వే స్టేషన్లు, నౌకాశ్రయాలు, ప్రభుత్వ రంగసంస్థలు అమ్మేస్తున్నారు. నౌకర్లు ఊడగొడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థల్ని అమ్మేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఊడగొడుతున్నారు. గ్యాస్, పెట్రోల్,డిజీల్ ధరలు పెంచుతున్నారు. గ్యాస్ ధర 950 రూ.చేసిసబ్సిడీ 250రూ. నుండి 40 రూ. కి తగ్గించారు. రైతులకు కేసీఆర్ రైతు బంధు ఎకరానికి పది వేలు ఇస్తే...బీజేపీ పెట్రోల్, డిజిల్ ధర పెంచింది. హుజూరాబాద్ టౌన్ లో  లో వోల్టేజ్ సమస్య ఉందని చెబితున్నారు. కోటీ 50లక్షలతో కొత్తసబ్ స్టేషను మంజూరు చేయిస్తున్నా. బొర్లపల్లి రోడ్ బాగా లేదన్నారు. మూడు కోట్లతో రోడ్ పనులకు మంజూరు.  నర్సింగాపూర్ రోడ్ కావాలని రైతులు అడిగారు. బ్రిడ్జి అండ్ రోడ్ కోసం కోటీ 70 లక్షలు మంజూరు.  గెల్లు శ్రీను ఉద్యమకారుడు.  20 ఏళ్లుతెరాసలో పని చేశాడు. ఉద్యమంలో అతనిపై 130 కేసులు నమోదయ్యాయి.  20 రోజులు చంచల్ గూడ, 10 రోజులు చర్లపల్లి జైలుకు వెళ్లాడు.  గెల్లును గెలిపించిండి. మీ అభివృద్ధి బాధ్యత మేం తీసుకుంటాం.  ఏడేళ్లు ఎనాడు పంచని రాజేందర్ పని చేస్తే... ఇవాళ గడియారాలు, కుట్టుమిషన్లు పంచాల్సిన అవసరం  ఏంటి..?   ఎన్నికలయినా మీకు అండగా నేను ఉంటా... పార్టీ ఉంటుంది. కేసీఆర్  ఆశీస్సులుంటాయని అన్నారు.

Related Posts