YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జాతీయ రహదారుల భూ సేకరణను పూర్తి చేయండి రైతులను ఒప్పించి రోడ్డు పనులను వేగవంతం చేయాలి క్షేత్ర స్థాయిలో దృష్టి సారించండి జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే రోడ్లు పూర్తి కావాలి - జిల్లా కలెక్టర్

జాతీయ రహదారుల భూ సేకరణను పూర్తి చేయండి రైతులను ఒప్పించి రోడ్డు పనులను వేగవంతం చేయాలి క్షేత్ర స్థాయిలో దృష్టి సారించండి జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే రోడ్లు పూర్తి కావాలి - జిల్లా కలెక్టర్

జాతీయ రహదారుల భూ సేకరణను పూర్తి చేయండి
రైతులను ఒప్పించి రోడ్డు పనులను వేగవంతం చేయాలి
క్షేత్ర స్థాయిలో దృష్టి సారించండి
జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే రోడ్లు పూర్తి కావాలి
- జిల్లా కలెక్టర్
చిత్తూరు, మా ప్రతినిథి,సెప్టెంబర్ 1
 జిల్లా లో పలు జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని, వాటికి సంబంధించిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని, పారిశ్రామికపరంగా జిల్లాను అభివృద్ధి చేయడానికి పారిశ్రామిక వాడలలో ఏపిఐఐసి కోసం భూ సేకరణను చేయాలని దీని ద్వారా జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ రాజాబాబు, మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, చిత్తూరు, తిరుపతి ఆర్డిఓ లు రేణుక, కనక నరసారెడ్డి మరియు కలెక్టరేట్ లోని భూ సేకరణ సిబ్బంది తో సమీక్ష నిర్వహించారు. జిల్లాకు పలు పారిశ్రామిక సంస్థలు రానున్నాయని వాటి కోసం భూ సేకరణ కార్యక్రమాలను పూర్తి చేయాలని అదే విధంగా తిరుమల లోని వేంకటేశ్వర స్వామి దర్శనానికి మరియు ఇతర ప్రాంతాలతో జిల్లా కు కనెక్టివిటీ ఉండడం వలన అత్యంత ప్రాధాన్యతగా కుక్కలపల్లి – మల్లవరం 6 లైన్ల రహదారికి కొన్ని చోట్ల భూసేకరణ పెండింగ్ లో ఉందని ప్రధానంగా కుక్కలపల్లి, పి.కొత్తకోట, పనబాకం, కృష్ణాపురం, ఇరిగిశెట్టివారిపల్లి, రేణిగుంట సమీపం లో మరి కొన్ని ప్రాంతాలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని చిత్తూరు, తిరుపతి ఆర్డిఓ లను ఆదేశించారు. శ్రీనివాసమంగాపురం, మేర్లపాక, ఏర్పేడు వద్ద భూ యజమానులను ఒప్పించి అప్పగించాలని అన్నారు. ఈ పరిధిలోని రైతులను ఒప్పించి పనులను వేగవంతం చేయాలన్నారు. అదే విధంగా చిత్తూరు – తచ్చూరు జాతీయ రహదారికి సంబంధించి మరో ఒక గ్రామంలో మాత్రం పనులు పెండింగ్ లో ఉన్నాయని ఆ పనులను పూర్తి చేసి అప్పగిస్తే జాతీయ రహదారి పనులు ప్రారంభం అవుతాయని కలెక్టర్ అన్నారు. ఎక్స్ ప్రెస్ హై కు సంబంధించి ఇంకా పరిహారం చెల్లించాల్సి ఉందని దానిని పూర్తి చేయాలన్నారు. బై రెడ్డి పల్లి సమీపంలో భూ సేకరణ కొంత పెండింగ్ లో ఉందని, రైతులను ఒప్పించి పూర్తి చేయాలని అన్నారు. మదనపల్లె – తిరుపతి 4 లైన్ల రహదారికి సంబంధించి భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని మదనపల్లె సబ్ కలెక్టర్ ను ఆదేశించారు. రోడ్డు విస్తరణ పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారని, ఈ పనిని వెంటనే పూర్తి చేయాలని అన్నారు.

Related Posts