YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కండువా మార్చిన..లేని అతీగతీ

కండువా మార్చిన..లేని అతీగతీ

విశాఖపట్టణం, సెప్టెంబర్ 2, 
వైసీపీలోకి వెళ్ళిన టీడీపీ నేతల పరిస్థితి హ్యాపీగా ఏమీ లేదు. వారు ఏదో జరుగుతుంది అనుకున్నారు. కానీ మరేదోలా పరిస్థితి తయారైంది. కనీసం నామినేటెడ్ పోస్టులు అయినా దక్కుతాయి అనుకుంటే వాటిని తీసుకెళ్ళి తమ పార్టీ వారికే పంచుకున్నారు. దాంతో ఇక ఎమ్మెల్యే టికెట్లు కోసమే ఆశ పెట్టుకోవాలి. అయితే అవి దక్కవని, ఇచ్చినా కోరిన చోట రావని ముందస్తు అంచనాలు ఉన్న వారు తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారుట. అలాంటి వారిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విశాఖ టీడీపీ జిల్లా మాజీ ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు ఒకరు. ఆయన ఇపుడు తన ఫ్యూచర్ పాలిటిక్స్ మీద తెగ కలవరపడుతున్నారు.నిజానికి రమేష్ బాబు యువకుడు, బలమైన కాపుసామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన 2009 ఎన్నికల్లో తొలిసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి పెందుర్తిలో మంచి మెజారిటీతో గెలిచారు. ఆ తరువాత ఆయన తన రాజకీయ గురువు గంటాతో పాటు టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పెందుర్తి టికెట్ కోరుకున్నా ఆయన్ని తీసుకెళ్ళి రూరల్ జిల్లా ఎలమంచిలికి షిఫ్ట్ చేశారు. దాంతో నాడు మొదలైన అసంతృప్తి కాస్తా 2019లో పార్టీ ఓడిన తరువాత బయటపడింది. ఈ నేపధ్యంలో వైసీపీ నుంచి కూడా రాయబారాలు నడవడంతో ఆయన వైసీపీలో చేరారు. చేరి రెండేళ్ళు అవుతున్నా ఎలాంటి ప్రయారిటీ లేదని, మూలన కూర్చోబెట్టేశారని రమేష్ బాబు మధన పడుతున్నారు.నిజానికి రమేష్ బాబుకు మొదటి నుంచి విశాఖ నార్త్ మీద మోజు ఉంది. ఆయన నివాసం ఉండేది కూడా అక్కడే. టీడీపీలో ఆ సీటు ఒకసారి పొత్తు రూపంలో పోతే మరోసారి ఏకంగా గంటా శ్రీనివాసరావు పోటీ చేయడంతో వదులుకోవాల్సి వచ్చింది. ఇక వైసీపీలో సైతం ఆయన ఇదే సీటు కోసం పట్టుపడుతున్నారు. అయితే జగన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న కె కె రాజు 2024 ఎన్నికల్లో ఇక్కడ నుంచి మరోసారి పోటీ చేయడం ఖాయమైంది. దాంతో విశాఖ ఉత్తరం మీద ఎవరు ఆశలుపెట్టుకున్నా కుదిరే వ్యవహారం కాదు. పోనీ పెందుర్తి సీటు ఇస్తారా అంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఉన్నారు. దాంతో రమేష్ బాబుకు టికెట్ మీద పక్కా క్లారిటీ అయితే వచ్చేసిందట.మరో వైపు టీడీపీలోకి పంచకర్ల రమేష్ బాబు రావడానికి కూడా ఇదే సీటు మెలిక ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ సీటు బీజేపీకి పోతుంది. దాంతో టీడీపీలోకి వచ్చినా సుఖం లేదు. అయితే పెందుర్తి సీటు ఇచ్చేందుకు మాత్రం టీడీపీ నుంచి హామీ ఉన్నట్లుగా చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో రమేష్ బాబు గెలిచిన సీటు కూడా కావడంతో ఆయన వైపు మొగ్గు చూపవచ్చు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఫ్యామిలీని దూరం పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నందువల్ల అక్కడ ఖాళీ ఉండే చాన్స్ ఉంది. దాంతో అయితే విశాఖ నార్త్ లేకపోతే పెందుర్తి సీటు అన్న గ్యారంటీతో రమేష్ బాబు టీడీపీలోకి జంప్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి ఇదే తీరున మిగిలిన నేతలు కూడా తమ దారి తాము చూసుకుంటే వైసీపీ సంగతి ఏమో కానీ టీడీపీలో కొత్త గొడవలు వస్తాయా అన్న చర్చ కూడా ఉంది మరి.

Related Posts