YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు బంధు పథకానికి అంతా సిద్దం

రైతు బంధు పథకానికి అంతా సిద్దం

రైతు బంధం క్రింద రైతులకు చెక్ ల పంపిణీ కి అంత సిద్ధం అయ్యింది..ఈ నెల 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెక్ లతో పాటు ,పాస్ బుక్స్ పంపిణీ కి  సంబందించిన అన్ని పనులను కలెక్టర్లు కి అప్పగించారు...పంపిణీ సమయం లో అందుబాటులో నీళ్ల తో పాటు మజ్జిగ ఉంచే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు...అయితే ఈ నెల 10 నా సీఎం కేసీఆర్ పంపిణీ ప్రారంభిస్తారు. రైతు బందు పథకంపై సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఖరారైంది. మే 10వ తేదీన కరీంనగర్ లో పర్యటించనున్నారు సీఎం. కరీంనగర్ తో పాటు కోమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.. ఇందుకు సంబంధించి అధికారిక షెడ్యూల్ ఖరారు అయ్యింది. అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ ఏర్పాట్ల కోసం జిల్లాకు రెండు కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం.... వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉదయం 7 నుంచి 11 గంటల వరకు.. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రైతులకు చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు అధికారులు.ఈ పథకం కింద ఏడాదికి రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.8వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వానకాలం సీజన్‌ కు సంబంధించి మే 10 నుంచి 17 వరకు ఎకరాకు రూ.4వేలు రైతు బంధు చెక్కుల పంపిణీ చేపట్టనున్నారు. రాష్ట్రంలోని కోటి 39 లక్షల 71వేల 568 ఎకరాలకు రూ.5వేల 588.62 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేయనున్నారు. 58లక్షల మంది రైతులు ఈ చెక్కులు అందుకోన్నారు. ఈ చెక్కుల మార్పిడి కోసం బ్యాంకుల్లో కూడా నిధులను అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. ఇప్పటికే రూ.2వేల కోట్లు బ్యాంకులకు చేరవేసింది.

Related Posts