YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బ్లాక్ మనీతోనే పార్టీలా..

బ్లాక్ మనీతోనే పార్టీలా..

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2, 
దేశంలో రాజకీయ పార్టీలన్నీ గుర్తు తెలియని మార్గాల్లో వస్తున్న విరాళాల మీదనే రాజకీయాలు చేస్తున్నాయి. అలా రాజకీయ పార్టీలకు అందుతున్న రూ. వేల కోట్లకు లెక్కల ఉండటం లేదు. ఎవరు ఇస్తున్నారు..? ఎలా ఇ‌స్తున్నారో కూడా తెలియదు. కానీ వేల కోట్లు మాత్రం పార్టీల ఖాతాల్లోకి వచ్ిచ పడుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు రూ. 3377 కోట్లు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి విరాళాలు వచ్చాయి. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో ఇది 70శాతం. అంటే.. రాజకీయ పార్టీలకు అందుతున్న మొత్తాల్లో కేవలం 30 శాతం మాత్రమే అధికారికం. మిగతా అంతా అనధికారికమే. అసలు అన్ని రాజకీయ పార్టీలకు వస్తున్న విరాళాల్లో 70 శాతానికి వివరాలు లేకపోతూండటం ఓ విశేషం అయితే.. అలా వస్తున్న సొమ్ములో 78 శాతం ఒక్క భారతీయ జనతాపార్టీకే వెళ్లడం మరో ట్విస్ట్. బీజేపీకి రెండేళ్ల కిందట ఒక్క ఏడాదిలో రూ. 2,642 కోట్ల ఆదాయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చింది. ఆ తరవాత అది అంతకంతకూ పెరుగుతూనే పోతోంది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్రం కొన్నాళ్ల క్రితం ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చాయి. ఆ బాండ్లను కొనుగోలు చేసే వారు వివరాలు చెప్పాల్సిన పని లేదు. ఈ కారణంగా పెద్జ ఎత్తున బ్లాక్ మనీ రాజకీయ పార్టీల ఖాతాల్లోకి చేరిపోతోందన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు అత్యంత పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అధికారాన్ని అడ్డగోలుగా ఉపయోగించి కార్పొరేట్ సంస్థలకు.. వ్యక్తులకు మేళ్లు చేసి వారి వద్ద నుంచి లంచాలుగా ఇలా విరాళాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు రావడానికి ఈ విరాళాలు కారణం అవుతాయి. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఈ విషయంలో ఏ మాత్రం సిగ్గుపడటం కానీ మొహమాటపడటం కానీ చేయడం లేదు. వేల కోట్ల విరాళాలు ఎవరిస్తారో.. ఎందుకిస్తారో తెలియనంత అమాయకులు ప్రజలు కాదు. ప్రజల్ని పార్టీలు మోసం చేయాలనుకంటే ఎల్లకాలం సాగకపోవచ్చు.

Related Posts