సకల దేవతలకు నిలయమైన హిందువులకు పూజనీయమైన, ఆరాధ్యమైన గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని, ఆ తల్లికి హాని తలపెట్టే వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని అందుకు వెంటనే పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకు వచ్చి అది కఠినంగా అమలయ్యేలా చూడాలని అలాహబాద్ హైకోర్ట్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
భారతీయ సంస్కృతిలో ఆవుకు విశిష్టమైన ప్రత్యేక స్థానం ఉందని, ప్రాధమిక హక్కు అనేది కేవలం గో మాంసం తినే వారికే ప్రత్యేకం కాదని, గోవును పూజించే వారికి, దాని మీద ఆర్ధికంగా ఆధారపడి జీవించే వారికి ఆ హక్కు ఉంటుందని పేర్కొంది.
చంపే హక్కు కన్నా జీవించే హక్కు ఉన్నతమైనదని కూడా పేర్కొంది.
ఒక దేశ సంస్కృతి విశ్వాసాలు దెబ్బ తింటే ఆ దేశం బలహీన పడుతుందని, అక్రమ గో వధశాలలు నడిపే వారిపైనా కఠిన చర్యలు తీసుకునేలా చట్టం చేయాలని ధర్మాసం కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసింది.