YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

పంజా విసురుతున్న వైరల్ ఫీవర్స్

పంజా విసురుతున్న వైరల్ ఫీవర్స్

సెప్టెంబర్ 2, 
ఓవైపు కరోనా వైరస్‌ థర్డ్‌ వేవ్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తుంటే.. మరోవైపు.. వైరల్‌ ఫీవర్స్‌ పంజా విసురుతున్నాయి. ప్రస్తుత రోజులు.. వైరల్‌ జ్వరాలకు సీజన్‌ కావడంతో.. ముఖ్యంగా డెంగీ కేసుల సంఖ్య పెరుగుతోంది. డెంగీలో ప్రధానంగా ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోవడం… అలా పడిపోయిన రోగులకు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే… ఇప్పుడిదే భయం.. అవగాహన లేమి…చాలా ఆసుపత్రులు దోపిడీకి తెరలేపాయి. ప్లేట్ లెట్స్‌ పడిపోతే ప్రాణాలు పోయే పరిస్థితి తప్పదనే భయంలో ల్యాబరేటరీలకు.. ఆసుపత్రులకు కాసుల పంట పండిస్తున్నాయి.పెరుగుతున్న సీజనల్‌ జ్వరాలకు.. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు ఒక క్రైటీరియా ఫీవర్ ఆసుపత్రి. ఇప్పుడు ఫీవర్‌ ఆసుపత్రి వైరల్‌ ఫీవర్లతో వణికిపోతోంది. సాధారణంగా ఆగస్టు నెల నుంచి జనవరి చివరి వరకూ.. సీజనల్‌ డిసీజెస్‌ పెరిగే నెలలుగా ఆరోగ్య శాఖ అంచనాలు వేస్తుంది. దీనికి తగ్గట్టుగానే.. ఒకవైపు కరోనా… మరోవైపు వైరల్‌ జ్వరాలు పెరుగుతున్నాయి. ఈ వైరల్‌ జ్వరాల్లో డెంగీ ఫీవర్‌లు మరింత ఆందోళన కల్గిస్తున్నాయి.ప్రతి ఆసుపత్రిలోనూ కరోనా కేసుల కంటే.. వైరల్‌ ఫీవర్ల కేసులే పెరుగుతున్నాయి. వచ్చిన ప్రతి వైరల్‌ ఫీవర్‌ డెంగీయేనా…..? డెంగీ అంటే ప్లేట్‌ లెట్స్‌ పడిపోయే లక్షణం ఉన్న జ్వరం. మరి ప్లెట్ లెట్స్‌ పడిపోయిన వెంటనే ప్రాణాలు పోయేంత హడావుడి జరుగుతోంది. దీన్నే వ్యాపారంగా మలుచుకుంటున్నాయి చాలా లేబరేటరీలు. ఆసుపత్రులు.. బిజినెస్‌ చేసుకునే పనిలో పడ్డాయి. రోగులను భయపెట్టి.. దోపిడీకి తెగబడుతున్నాయి.  ప్రతి రోగిలోనూ ఒక లక్షా యాభైవేల నుంచి 4లక్షల వరకూ ప్లేట్‌ లెట్స్‌ ఉంటాయి. వీటిలో డెంగీ జ్వరం వచ్చిన వెంటనే ప్లేట్‌ లెట్స్‌ పడిపోతాయి. అయితే.. ప్లేట్‌ లెట్స్‌ పడిపోయిన వెంటనే భయపడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. 50వేల వరకూ పడిపోయినా.. కొన్ని కేసుల్లో 10 వేల వరకూ పడిపోయినా.. ప్లేట్‌ లెట్స్‌ కోసం పరుగులు తీయాల్సిన అవసరం లేదంటున్నారు.డెంగీ వచ్చిన వెంటనే పడిపోయే ప్లేట్‌ లెట్స్‌ హాని కల్గిస్తాయి. అయితే.. డెంగీలో జరుగుతున్న ప్లేట్‌ లెట్స్‌ వ్యాపారం.. రోగుల్లో అవగాహన లోపంతోనే సాగుతోందంటున్నారు వైద్యులు. ప్లేట్ లెట్స్‌ పడిపోయిన వెంటనే.. ఆందోళన పడటం.. లేబరేటరీలకు పరుగులు తీయడం .. దాన్ని వ్యాపారంగా చేసుకునే పరిస్థితులకు చెక్‌ చెప్పాలంటే అవగాహన అవసరం అంటున్నారు డెంగీ ట్రీట్‌మెంట్‌ చేస్తున్న వైద్యులు. పదివేల లోపు వరకూ.. కొన్ని కేసుల్లో 3, 4 వేలకు ప్లేట్‌ లెట్స్‌ పడిపోయిన వారికి సైతం ట్రీట్‌ మెంట్‌ చేసి వారు కోలుకునే పరిస్థితులు ఉన్నాయంటున్నారు మరికొందరు వైద్యులు.డెంగీ నిజంగా ఒక ప్రమాదకరమైన వైరల్‌ ఫీవర్‌. అయితే.. దీని నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ముఖ్యం. ప్రధానంగా ఈ వైరస్‌ ను వ్యాప్తిచేసే దోమలను అరికట్టడం ప్రధానం. మరోవైపు వ్యాపారం సాగుతున్న డెంగీ ట్రీట్‌మెంట్‌ పరిస్థితులకు చెక్‌ చెప్పాలంటే… ప్రజలకు అవగాహన.. హద్దులు లేని వ్యాపారాలకు కళ్లెం వేయడం ముఖ్యం. దీని కోసం.. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌తో పాటు అధికారులకు ప్రజా ప్రతినిధులకు .. విజ్ఞప్తులు ఇచ్చే పరిస్థితి. ప్రతి డెంగీ సీజన్‌లోనూ ఇలాంటి విజ్ఞప్తులు ప్రభుత్వాలకు అందుతునే ఉన్నాయి.  ఇంతకీ డెంగీ వల్ల ఎప్పుడు డేంజర్‌ అంటే.. దానికి అలాంటి పరిస్థితులు పేషంట్లలో స్పష్టంగా కనిపిస్తాయంటున్నారు వైద్యులు. డెంగీ వల్ల రక్తం గడ్డ కట్టే పరిస్థితులు పూర్తిగా దూరమై.. శరీరంలోని వివిధ భాగాల నుంచి రక్తం బ్లీడింగ్స్ వస్తాయని.. ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోతున్న ప్లేట్‌ లెట్స్‌ను భర్తీ చేయడానికి ప్లేట్‌ లెట్స్‌ అవసరం ఉంటున్నారు వైద్యులు .అయితే… డెంగీ వచ్చిన వెంటనే … ప్లేట్‌ లెట్స్‌ కౌంట్‌ చేయించుకోమనడం ఆసుపత్రుల్లో సర్వసాధారణం. అందుకే లేబరేటరీల చుట్టూ జనం పరుగులు పెడుతున్నారు. మరి అక్కడ లేబరేటరీల్లో ఇచ్చే రిపోర్టులన్నీ నూటికి నూరు శాతం ఖచ్చితమైనవేనని… ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. లేబరేటరీలకు లేబటరీలకు మధ్య తేడాతో పాటు.. రోగి కండీషన్‌ కూడా ఎప్పటికపుడు మారుతోందంటున్నారు వైద్యులు.లేబరేటరీల్లో పరీక్షలు చేసే సమయంలో.. అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి. రోగి దగ్గర శాంపిల్స్ తీసుకునే పరిస్థితుల నుంచి.. అక్కడ ఉండే టెక్నికల్‌ సిస్టమ్‌ వరకూ ఆధారపడి ఉంటుందంటున్నారు లేబరేటరీల లెక్నీషియన్లు… ఫెథాలజిస్టులు. అందువల్ల.. ఒక లేబరేటరీల్లో చెక్‌ చేయించుకుని.. అదే ప్రామాణికం అని ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు ల్యాబ్‌ టెక్నీషియన్స్‌.అందుకే .. డెంగీ ఫీవర్లు పైనా , దీన్ని ఆసరాగా చేసుకుని కొనసాగుతున్న పరిస్థితులపైనా ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌ తో పాటు అనేక మంది ప్రజా ప్రతినిధులకు.. విజ్ఞాపనలు ఇచ్చామంటున్నారు డెంగీ ఫీవర్ల పరిస్థితులపై పోరాటం చేస్తున్న డాక్టర్‌ ప్రభు కుమార్‌. అనేక ఏజన్సీ .. మారుమూల ప్రాంతాల్లోనూ, సరైన పారిశుద్ధ చర్యలు లేని చోట్ల డెంగీ అతి ఎక్కువగా ప్రతి ఏటా వెంటాడుతున్న సమస్య అంటున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు.. సీరియస్‌గా చర్యలు తీసుకుంటే తప్ప పరిష్కారం రాదంటున్నారు.ఇప్పటికైనా డెంగీ ఫీవర్లతో కొనసాగుతున్న భయాలు.. దీన్ని అడ్డుపెట్టుకుని సాగుతున్న వ్యాపారాలపై ఆరోగ్య శాఖ దృష్టిపెట్టడంతోపాటు… రోగుల్లో లేనిపోని భయాలు కల్గిస్తూ అడ్డగోలు వ్యాపారాలకు… దిగుతున్న ఆసుపత్రులు, వైద్యులపై చర్యలు తీసుకోవాలి.

Related Posts