తిరుమల
తిరుమలలో హుండీ చిల్లర వదిలించుకునేందుకు టిటిడి మంచి స్కీం ఆలోచించింది. చిల్లర నాణేలను బ్యాంకులు తీసుకోకపోవడంతో , ధన ప్రసాదం పేరుతొ పూజా కుంకుమ కలిపి , వాటిని భక్తులకే అంటగట్టే పధకం ఆలోచించింది. గదులు బుక్ చేసుకున్న భక్తులకు తిరిగి ఇచ్చే కాషన్ డిపాజిట్ విధానంలో కొత్త స్కీం తీసుకొచ్చింది టిటిడి. శ్రీ వారి హుండిలో భక్తులు సమర్పించే చిల్లర నాణ్యాలను ధన ప్రసాదం పేరుతో గదులు ఖాళీ చేసే భక్తులకు అందిచే విధానాన్ని ప్రారంభించింది. ఈ మేరకు స్వామివారి గంధం, కుంకుమా, పసుపుతో కలిసి ప్యాక్ చేయబడ్డ 100, 200, 500, ప్యాకెట్లను ఉప సమాచార కార్యాలయాల్లో అందుబాటులో వుంచింది. తద్వారా హుండి పడే చిల్లర టిటిడి ఖజానాలో కాళీ అవ్వడంతో పాటు భక్తులకు ఓ ప్రసాదంలా అందుతుంది.