హైదారాబాద్
టాలీవుడ్ డ్రగ్ కేసు లో ఈడీ విచారణకు నటి ఛార్మి గురువారం హజరయ్యారు. ఈడీ కార్యాలయం దగ్గర ఛార్మి బౌన్సర్ల హల్చల్ చేసారు. ఈడీ కార్యాలయం దగ్గర 15 మంది బౌన్సర్ల హంగామా సృష్టించారు. కెల్విన్ ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఛార్మి పేరు వుండడంతోఆమెను ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. కెల్విన్ ఛార్మీని దాదా అనే పేరుతో సేవ్ చేసుకున్నాడు. దాదా పేరుతో ట్రాన్సాక్షన్స్ ఈడీ అధికారులు గుర్తించారు. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఛార్మిని విచారిస్తున్నారు. కెల్విన్ నుంచి బ్యాంక్ లావాదేవీల వివరాలు సేకరించినట్లు సమాచారం. బ్యాంక్ ఖాతాల వివరాలు, లావాదేవీలపై విచారణ జరిగింది.