నూజివీడు
అక్రమంగా తెలంగాణా మద్యాన్ని తరలిస్తున్నారని నూజివీడు యస్.ఈ.బి ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ కు సమాచారం రావడంతో ఆయన తన యొక్క సిబ్బందితో నూజివీడు పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టారు.తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుండి ఆగిరిపల్లికి తెలంగాణ రాష్ట్ర అక్రమ మద్యం తరలిస్తుండగా నూజివీడు బైపాస్ రోడ్డు వద్ద మద్యం స్వాధీనం చేసుకుని మొత్తం 288 క్వార్టర్ సీసాలు మద్యం స్వాధీనం చేసుకుని మద్యం తరలిస్తున్న స్కార్పియో సీజ్ చేసి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన యస్.ఈ.బి ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ.ఈ అక్రమ మద్యం యొక్క విలువ తెలంగాణ రాష్ట్రంలో 48 వేల రూపాయలు ఉంటుందని మన రాష్ట్రంలో లక్ష రూపాయలు ఉంటుందని యస్.ఈ.బి ఇన్స్పెక్టర్ గోపాల్ కృష్ణా తెలిపారు.ఎవరైనా తెలంగాణ రాష్ట్ర మద్యం రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.