జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఉండవెళ్లిలో అలంపూర్ ఎమ్మెల్యే డా.వి.ఎమ్ అబ్రహం గురువారం నాడు తెరాస జెండా ఆవిష్కరించారు. అయతే, అయన పై గ్రామస్థులు మండిపడ్డారు. జెండా ఎగరేస్తే మళ్లీ జెండా ఎగరేసి వరకు రాడని, కెసిఆర్ చేసింది కాదు నువ్వు చేసింది చెప్పాలంటూ తిరగబడ్డారు. తెలంగాణ అభివృద్ధిలో అలంపూర్ అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. ఆర్డీఎస్ సాగునీరు ఎక్కడ పారుతుందో చూపించాలని డిమాండ్ చేసారు. జెండా ఎగర వేసిన ఎమ్మెల్యే ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు.