YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బహిరంగ చర్చకు సిద్దామా

బహిరంగ చర్చకు సిద్దామా

హుజూరాబాద్
హుజూరాబాద్ లోని మధువని గార్డెన్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బొడిగ శోభ, ఎండల లక్ష్మీ నారాయణ, ఏనుగు రవీందర్ రెడ్డి హజరయ్యారు. ఈటల మాట్లాడుతూ హరీష్ రావ్  హుజూరాబాద్ లో అడ్డా పెట్టి అబద్దాల కారు కూతలు కూస్తున్నారు. డ్రామా కంపెనీ లాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడు.  ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్దం, ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్దతి ఆపకపోతే నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది.  హరీష్ నీకు సవాలు చేస్తున్న..  అభివృద్ది జరగలేదు. డబుల్ బెడ్ రూమ్ కట్టలేదు. కుంకుమ భరిణలు పంపించి ఓట్లు అడిగేస్తాయికి దిగజారినవని అన్నారు. నీ వెంట నాయకులు లేరు నా వెంటే ఉన్నారు అని ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటి మీద హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా లో బహిరంగ చర్చకు సిద్దమా అని సవాలు విసురుతున్నా. నేనే అన్నీ ఏర్పాట్లు చేస్తా. నువ్వు ఇంత తోపు, తురుం ఖాన్ వి కదా బహిరంగ చర్చకు సిద్దామా అని అడిగారు.

Related Posts