అమరావతి
మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన హైకోర్టు కేసులను కొట్టేసింది. గతంలో ఈ కేసులో స్టే ఉండడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తరువాత సుప్రీంకోర్టులో పిటిషన్ విత్ డ్రా చేసుకుంది. నెల రోజుల్లో కేసును తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.తాజాగా జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ జరిపింది. దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై కేసులను కొట్టేసింది. ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు దమ్మాలపాటి శ్రీనివాస్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని న్యాయ స్థానం స్పష్టం చేసింది.