కడప సెప్టెంబర్ 02
కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఉన్న గారిశా ఆటోమోటివ్స్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ వారి న్యూ క్లాసిక్-350 టూ వీలర్ వెహికల్స్ ను ప్రోప్రైటర్ వంశిరాంరెడ్డి లాంచింగ్ చేశారు. ఈ సందర్భంగా గరిశా ఆటోమోటివ్స్ ప్రొప్రైటర్ వంశీ రామ్ రెడ్డి మాట్లాడుతూ రాయల్ ఇన్ ఫీల్డ్ కంపెనీవారు యువత, మధ్య వయసులో వారి కోసం న్యూ క్లాసిక్ వెహికల్స్ ను అన్ని హంగులతో మార్కెట్లో విడుదల చేయడం జరిగిందన్నారు. 11 కలర్స్ ఉన్నాయన్నారు. 3 వేరియంట్స్ ఉన్నాయని తెలిపారు. సింగిల్ ఛానల్ ఏ బి ఏస్, డ్యూయల్ ఛానల్ వేరియంట్ ఉన్నాయన్నారు. జిపిఎస్ సౌకర్యం కలదు అని తెలిపారు. గత మోడల్స్ వెహికల్ కన్నా నూతన వెహికల్స్ లో 320 పార్ట్స్ కొత్త వి పరికరాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీటింగ్ కెపాసిటీ పెద్దగా ఉందని చెప్పారు. ఆ లైవ్ వీల్స్ కు ట్యూబ్ లెస్ టైర్ లు పెద్దగా ఏర్పాటు చేశారన్నారు. కడప ప్రొద్దుటూరు రాయచోటి రాజంపేట బద్వేల్ ప్రాంతాలలో ఒకేసారి వెహికల్ లాంచింగ్ చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్,సుధీర్, షోరూం మేనేజర్ సుధీర్, సిబ్బంది పాల్గొన్నారు.