YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డా.వై.ఎస్  సేవలు మరువలేనివి 

డా.వై.ఎస్  సేవలు మరువలేనివి 

డా.వై.ఎస్  సేవలు మరువలేనివి 
ఏ రాష్ట్రంలో లేని విధంగా ఫీజు రీయిం బేర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను తీసుకొని  వచ్చిన ఘనత  రాజశేఖర రెడ్డి గారిదే
 పుంగనూరు, మా ప్రతినిధి,సెప్టెంబర్ 2
 దివంగత రాష్ట్ర ముఖ్య మంత్రి డా.వై.ఎస్.రాజ శేఖర రెడ్డి   తన పాలనలో ప్రజల మన సులను గెలిచారని గౌ.రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు..
 గురువారం దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజ శేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి,భూ గనులశాఖ మంత్రి  పులిచెర్ల (మం) కల్లూరు, సదుం బస్టాండ్ వద్ద, సోమల  మండల  నాలుగు రోడ్ల కూడలి వద్ద,చౌడేపల్లి మండల కేంద్రం, పుంగనూరు పాత బస్ స్టాండ్ వద్ద, సుగాలి మిట్ట వద్ద డా.వై ఎస్.రాజ శేఖర్ రెడ్డి గారి విగ్రహాలకు పూల మాలలతో ఘనంగా నివాళులర్పించారు...  
 పుంగనూరు పాత బస్ స్టాండ్ వద్ద డా.వై.ఎస్.రాజ శేఖర్ రెడ్డి విగ్రహాని కి మంత్రి వర్యుల తో పాటు గౌ.చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్. రెడ్డప్ప,     గౌ.రాష్ట్ర జానపద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పుంగనూరు,కుప్పం,మదనపల్లె నగర అభివృద్ధి సంస్థ చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్, బోయ కొండ గంగమ్మ తల్లి ఆలయ పాలక మండలి చైర్మన్ శంకర్ నారా యణ, పుంగనూరు మునిసిపల్ చైర్మన్ ఆలీమ్ భాష లతో   ఘనంగా నివాళులు అర్పించారు...
 అనంతరం ఉచిత వస్త్రాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాన్ని మరియు రక్త దాన శిబిరం ను  గౌ.మంత్రి వర్యులు ప్రారంభించారు...       
 అనంతరం మంత్రి వర్యులు మాట్లాడు తూ దివంగత మహా నేత డా. వై.ఎస్.రాజ శేఖర్ రెడ్డి వారు చేసి న సేవలను ఎన్నటికీ ప్రజలు మరువ లేర నన్నారు... వారు తీసు కొని వచ్చిన పథకాలు పేద ప్రజలందరికీ ఎంతో ఉపయోగ పడి వారి జీవితాల్లో వెలుగులు నింపా యన్నారు..ప్రధానంగా విద్య, వైద్య రంగాల లో  ఏ రాష్ట్రంలో లేని విధంగా ఫీజు రీ యిం బర్సుమెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను తీసు కొని  వచ్చిన ఘనత  దివంగత ముఖ్య మంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారిదే నన్నారు.దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు మరణించి 12 సంవ త్సరాలు అయినా ప్రజలు వారిని హృద యాలలో పెట్టుకొని పూజిస్తున్నారని , అం తటి గొప్ప నాయ కుడు ఈ రాష్ట్రానికి లేకుండా పోవడం  మన దురదృష్టమని , ఆయన బాద్యతలను మన గౌ. ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తీసు కొని పరిపాలన సాగి స్తున్నారని తెలిపారు.. పాదయాత్రలో చెప్పిన విషయాలను , మేని ఫెస్టో లో పెట్టిన అం శాలను ,పథకాలను పూర్తిగా అమలు చేస్తు న్న ఘనత గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి  వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన న్నారు... దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్.రాజశేఖర రెడ్డి గారి జన్మ దినాన్ని మరియు వర్దంతిని ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుపు కోవాలని కోరారు.
 ఈకార్యక్రమాలలో  మునిసిపల్ కమీషనర్ కె.ఎల్.వర్మ, నాయ కులు పెద్దిరెడ్డి,పోకల అశోక్ కుమార్,జయ చంద్రా రెడ్డి,మండల స్థాయి అధికారులు, నాయకులు అనది కారులు,తది తరులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Related Posts