YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మహిళా భద్రతకోసమే దిశ చట్టం

మహిళా భద్రతకోసమే దిశ చట్టం

మహిళా భద్రతకోసమే దిశ చట్టం
గుంటూరు
మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ దిశా చట్టం రాష్ట్రపతి అనుమతి పొందే సమయానికల్లా చట్టాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరోవైపు కొంతమంది దిశ పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నారని, అలా దిశ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేయడం బాధాకరమని అసహనం వ్యక్తం చేశారు. అనేక మంది మహిళలు ఇప్పటికే దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్నారని గుర్తు చేశారు.గతం ప్రభుత్వంలో మహిళా తహశీల్దార్ పై ఎమ్మెల్యే దాడి చేసిన పట్టించుకోలేదని, మరి ఇప్పడు అదే టీడీపీ శ్రేణులు దిశ చట్టాన్ని అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టం ద్వారా ఏడు రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేస్తున్నారని, ఇప్పటికీ ఆ విధంగా 1500 కేసుల్లో 7రోజుల్లో ఛార్జిషీటు వేశామన్నారు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వ్యాఖ్యానించారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవద్దని, ఏదైనా ఘటన జరగగానే దాన్ని మానవతా దృక్పథంతో చూడకుండా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు.

Related Posts