21 మంది చందనం స్మగ్లర్లు ఆరెస్టు
చిత్తూరు
చిత్తూరు జిల్లా లో పెద్ద సంఖ్యలో ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో పోలీసులకు పట్టుబడ్డారు. వడమాలపేట సమీపంలో 21 మంది తమిళ స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి ఇనుప గొడ్డళ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని వడమాలపేట అటవీ ప్రాంతంలో పెద్దసంఖ్యలో ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో పోలీసులకు పట్టుబడ్డారు. ఎర్రచందనం కోసం అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన 21 మంది తమిళ స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వడమాల పేట అంజారమ్మ కనుమ ఆలయం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. సిబ్బంది ని చూసి స్మగ్లర్లు లారీలో నుంచి దిగి పారి పోయే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని చుట్టు ముట్టి డ్రైవర్ తో సహా 21 మందుని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు కు చెందిన మెస్త్రీ అమరేశన్ ఎర్రచందనం దుంగలు కోసం తీసుకుని వస్తున్నట్లు విచారణ లో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు వీరి నుంచి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, 10 ఇనుప పిడిలేని గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇంకా వీరి దగ్గర 12 సెల్ ఫోన్లు, 10,910 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా వీరిలో ఐదుగురిని జువెనెల్ హోం తరలించగా, 16 మండిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.