YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 రాజధానిలో టీఆర్‌ఎస్  పార్టీ కార్యాలయం

 రాజధానిలో టీఆర్‌ఎస్  పార్టీ కార్యాలయం

 రాజధానిలో టీఆర్‌ఎస్  పార్టీ కార్యాలయం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2, 
అధికార టీఆర్‌ఎస్ పార్టీ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసి కార్యాలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. సరిగ్గా మధ్యాహ్నం 1:48 గంటలకు సీఎం కేసీఆర్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కుటుంబం పండుగలా కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ సూచించడంతో టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకులు హస్తినకు తరలివచ్చి శంకుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పునాది రాయి వేశారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు. కేసీఆర్ కుటుంబ సమేతంగా భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో మెట్రోస్టేషన్ సమీపంలో కేంద్ర కేటాయించిన స్థలంలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1300 గజాల స్థలంలో జీ ప్లస్ - 3 భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటి వరకూ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో ఆఫీసు లేదు. సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన డీఎంకే, ఏఐడీఎంకే, టీడీపీ, జనతాదళ్ ఎస్ వంటి పార్టీలకు ఇక్కడ ఎలాంటి భవనం లేదు. ఒక్క సమాజ్ వాది పార్టీకి తప్ప ప్రాంతీయ పార్టీలకంటూ ఢిల్లీలో సొంత భవన సదుపాయమే లేదు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలుంటే.. ఇప్పటి వరకూ వీటిలో ఏ ఒక్క పార్టీకీ సొంత భవనం లేదు. ఇపుడీ గులాబీ భవన నిర్మాణంతో టీఆర్ఎస్ కొత్త ట్రెండ్ సెట్ చేయబోతోందని అంటున్నాయి గులాబీ శ్రేణులు.40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జీ ప్లస్ 3 భవన సముదాయంతో TRS భవన్‌ను నిర్మించనున్నారు. మీటింగ్‌ హాల్‌తో పాటు రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చే వారు స్టే చేసేందుకు అన్ని వసతులుండేలా ఈ భవన నిర్మాణాన్ని డిజైన్ చేశారు. అయితే TRS భవన్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను పోలి ఉంటుందని అంటున్నారు పార్టీ వర్గాల వారు.వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే శంకుస్థాపన కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్, లాక్‌డౌన్‌ వల్ల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఏడాదిలోపే నిర్మాణాన్ని పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా గ్రాండ్‌గా జరపాలని ప్లాన్ చేశారు.సీఎం కేసీఆర్ రాక సందర్భంగా ఢిల్లీలో టిఆర్ఎస్ భవన్ శంకుస్థాపన సందర్భంగా ఢిల్లీ పురవీధులు గులాబి మయమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి నాయకత్వం అప్పటికే ఢిల్లీకి చేరుకోవడంతో తెలంగాణ భవన్ పరిసర భవనాలన్నీ టీఆర్ఎస్ నేతలతో కోలాహాలంగా మారాహైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం డిజైన్‌లోనే భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పెద్ద మీటింగ్ హాల్‌తో పాటు పార్టీ నేతలు ఢిల్లీ వచ్చిన సమయంలో బస చేసేందుకు వీలుగా సకల సౌకర్యాలతో టీఆర్‌ఎస్ భవన్ నిర్మించనున్నారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మల్లా రెడ్డి, ఎర్రబెల్లి, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సీనియర్ నేతలు కేకే, వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.
అట్టహాసంగా  జెండా పండుగ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఫలితంగా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో గులాబీ జెండా రెపరెపలాడుతోంది. టీఆర్‌ఎస్‌ జెండా పండుగ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం మిఠాయిలు పంచి పెట్టారు. పల్లెపల్లెనా, పట్టణాల్లో వార్డు వార్డునా టీఆర్‌ఎస్‌ నేతలు గులాబీ జెండాను ఎగుర వేసి జెండాపండుగను ఘనంగా నిర్వహించారు.టీఆర్ఎస్ నేత పర్యాద కృష్ణమూర్తి గులాబీ జెండాను ఎగుర వేసిన అనంతరం మాట్లాడుతూ.. ప్రతీక్షణం ప్రజాహితం కోసం పరితపించే వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన జెండా పండుగలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి హాజరయ్యారు.అటు, వరంగల్‌ జిల్లాలో టీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా జరిగింది. టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉత్సాహంగా గులాబీ జెండాలను ఆవిష్కరించారు. నర్సంపేట పట్టణంలో టీఆర్ఎస్ జెండా జెండాను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎగురవేశారు. టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజధాని హైదరాబాద్ లోని అన్ని పార్టీ ఆఫీసులతోపాటు, బస్తీల్లోనూ గులాబీ జెండా పండుగ ఘనంగా జరుగుతోంది

Related Posts