YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం కావాలి

ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం కావాలి

ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం కావాలి
పురోగతి చూపకపోతే చర్యలు తప్పవు
అన్నింట్లో  జిల్లా మొదటి, రెండవ స్థానంలో ఉండేలా అధికారులు కృషి చేయాలి
జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరగాలి
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ప్రభుత్వ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలి
జాతీయ ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలి
ఉపాధి హామీ పథకంలో లేబర్ బడ్జెట్ ను అచీవ్ కావాలి సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు
కర్నూలు, సెప్టెంబర్ 02
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో పురోగతి కనిపించాలని, ఆదోని డివిజన్ లో మొదటి సారి సమీక్ష నిర్వహిస్తున్నామని, రెండవసారి సమీక్షలో పురోగతి సాధించకపోతే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని ,అలాంటి వారిపై  చర్యలు తీసుకుంటామని అధికారులను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు అధికారులను హెచ్చరించారు.
గురువారం ఆదోని శ్రీనివాస కళ్యాణం మండపంలో ఆదోని డివిజన్ స్థాయిలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు- ఇంటి నిర్మాణాల పురోగతి, ఇంటి పట్టాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణాల పురోగతి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, వ్యవసాయ శాఖ, సర్వే మరియు రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలు, కోవిడ్ - 19 తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరావు సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా అధికారులు, నియోజక వర్గ స్పెషల్ అధికారులు, మండల స్పెషల్ అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ....రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రవేశపెట్టిన పథకాలలో జిల్లా వెనకబడ్డకుండా జిల్లాను మొదటి, రెండవ స్థానంలో ఉండేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒకటిన్నర సంవత్సరం క్రితం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం తీసుకొచ్చిందని, కింద స్థాయిలో ఆశించినంత మేరకు ఇంకా పనులు మొదలు పెట్టలేదని జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్ ఇంజనీర్లు, మండల ఆఫీసర్ లు సమన్వయంతో టీమ్ గా పనిచేసి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు.
నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్లు హౌసింగ్ ప్రోగ్రాం పై మానిటరింగ్ చేస్తూ సంబంధిత ఇంజనీర్లతో సమీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అధికారులు అందరూ సీరియస్ గా తీసుకుని కలిసికట్టుగా పనిచేసి అన్ని విషయాల్లోనూ జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం సంబంధించి ఇళ్ల నిర్మాణాలలో పనితీరు మెరుగు పడాలని, పురోగతి సాధించకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హౌసింగ్ శాఖ ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. 15 రోజులకు ఒకసారి నియోజకవర్గ స్థాయిలో పథకాల అమలు,  పురోగతి పై   సమీక్షలు నిర్వహించాలని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ల ను  ఆదేశించారు
ఆదోని రెవెన్యూ డివిజన్ లో 55083 ఇళ్లు మంజూరయ్యాయని, ఇందులో ఇంకా 8234 ఇల్లు పనులు మొదలు పెట్టలేదని, 28103 బిలో బేస్మెంట్ లెవెల్, 1004 బేస్మెంట్ లెవెల్ లో ఉన్నాయిని, శనివారం నాటి కల్లా 8234 గృహాలు వెంటనే గ్రౌండింగ్ కావాలని హౌసింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 28103 బిలో బేస్మెంట్ లెవెల్ లో ఉన్న గృహాలు ఎట్టి పరిస్థితుల్లో బేస్మెంట్ స్థాయికి తీసుకు రావాలని, బేస్మెంట్ లెవెల్ లో ఉన్న 1004 లతో కలిపి ఐదు వేల గృహాలు బేస్మెంట్ లెవెల్ కు తీసుకు రావాలని ఆదోని హౌసింగ్ ఈఈను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
రిజిస్ట్రేషన్ సంబంధించి 9499 పెండింగ్లో ఉన్నాయని, ఇందులో దేవనకొండ మండలం 395, మంత్రాలయం 253, ఆదోని 3106, ఆలూరు 870, మంత్రాలయం 1921, పత్తికొండ 1686, ఎమ్మిగనూరు 1686 రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్నాయని రెండు రోజుల్లో పూర్తి చేయాలని హౌసింగ్ ఏఈలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జియో ట్యాగింగ్ సంబంధించి ఆదోని 6942, ఆలూరు 1576, మంత్రాలయం 2587,  పత్తికొండ 1835, ఎమ్మిగనూరు 3872 పెండింగ్లో ఉన్నాయని, మ్యాపింగ్ లో ఆదోని 1843, ఆలూరు 141,  మంత్రాలయం 262, పత్తికొండ 372, ఎమ్మిగనూరు 506 పెండింగ్లో ఉన్నాయని, హౌసింగ్ అధికారులంతా ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. వాటర్ సప్లై సంబంధించి 376 లేవుట్ లకు పది రోజుల్లో నీరు అందించాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పవర్ సప్లై సంబంధించి పది రోజుల్లోగా జగనన్న కాలనీలలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జియో ట్యాగింగ్, మ్యాపింగ్, రిజిస్ట్రేషన్, గ్రౌండింగ్ కానీ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులన్నీ  పూర్తి  చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి పథకాల పురోగతిలో కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ ఎంపిడిఓలను ఆదేశించారు.
ప్రభుత్వం  ప్రజల చెంతకే పాలన అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయలు, రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ తదితర కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా నూతన వ్యవస్థను తీసుకొచ్చిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని  నిర్దేశించిన గడువులోగా  భవనాలను పూర్తి చేసి వెంటనే అప్పజెప్పాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆదోని డివిజనల్ లో గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ భవన నిర్మాణాలకు సంబంధించి 992 వర్క్స్ మంజూరు కాగా, ఇంకా 69 భవనాలకు సంబంధించి పనులు ప్రారంభం కాలేదని శనివారం నాటి కల్లా పనులను వెంటనే ప్రారంభించాలని పంచాయతీ రాజ్ ఈఈ, డిఈలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు

Related Posts