విశాఖపట్నం
విశాఖ ఆదివాసి ప్రాంతమైన పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో కాలం చెల్లిన పైపుల అక్రమాలపై అధికారులు కనీసం విచారణ చేపట్టిన పాపాన పోలేదని సిపిఐ పార్టీ పాడేరు మండల కార్యదర్శి కూడ రాధాకృిష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంచె చేను మేస్తే.... కాపలా కాసేది ఎవరు అనే విదంగా అధికారుల తీరు ఉందని అన్నారు. ఆగస్టు నెలలో మొత్తం గ్యాస్ బండ మార్పిడి కోసం వెళ్ళిన లబ్ధిదారులకు 150 రూపాయలు చెల్లించకపోతే మీ గ్యాస్ బండ మార్పిడి జరగదని గ్యాస్ ఏజెన్సీ అధికారులు చెప్పడంతో గత్యంతరం లేక కాలంచెల్లిన పైపులు తీసుకోవలసిన పరిస్థితి వచ్చిందని. అయితే రోజుకి 1000 నుండి 1500 వరకు లబ్ధిదారులు గ్యాస్ మార్పిడి కోసం గ్యాస్ గోడౌన్ లో బండలు మార్పిడి చేసుకోవడం జరుగుతుందని. ఒక్కరోజు వెయ్యి మంది గ్యాస్ బండలు మార్పిడి జరిగిన ఒక లక్షా 50 వేల రూపాయలు లబ్ధిదారుల నుండి అడ్డగోలుగా వసూలు చేశారని మండిపడ్డారు.తక్షణమే లబ్ధిదారులకు తిరిగి డబ్బులు చెల్లించాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పాడేరు పట్టణంలో గ్యాస్ బండలు డోర్ డెలివరీ చేయాల్సి ఉన్నప్పటికీ డోర్ డెలివరీ చేయడం లేదని తక్షణమే పాడేరు పట్టణ పరిధిలో గ్యాస్ బండలు డోర్ డెలివరీ చేయాలని, బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా గ్యాస్ బండలు తరలి పోతున్నాయని, పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల మండలాలకు ఏకైక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఒక్కటే ఉండటంతో రైతుల పనులు మానుకొని 20 ,30 కిలోమీటర్లు దూరం నుంచి వచ్చే లోపే బ్లాక్ మార్కెట్లో తరలిపోతుందన్నారు.లబ్దిదారులు మాత్రం నిరాశతో గ్యాస్ గోడౌన్ దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తుందని అందులో గ్యాస్ ఏజెన్సీ అధికారులు రోజుకో కొత్త రూల్స్ తీసుకురావడం గ్యాస్ లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. గ్రామాలలో కూడా గ్యాస్ బండలు డోర్ డెలివరీ చేయాలని, గ్యాస్ పైపుల అక్రమాలపై నిజాలు బయటపెట్టాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పాడేరు మండలం నాయకులు అమర్ ,మున్నా పాల్గొన్నారు.