YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దిశపై దుష్ప్రచారం బాధాకరం

దిశపై దుష్ప్రచారం  బాధాకరం

విశాఖపట్నం
మహిళ భద్రత కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. విశాఖపట్నం ఆర్కే  బీచ్ వద్ద జరిగిన 1971 వార్ గోల్డెన్ జూబ్లీ విక్టరీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మీడియా తో మాట్లాడటం జరిగింది. మహిళల భదత్ర కోసం తీసుకొస్తున్న దిశ చట్టాన్ని ప్రతిపక్ష నాయకులు అవహేళన చూస్తూ మాట్లాడటం తగదని హోంమంత్రి అన్నారు. ఉద్దేశపూర్వకంగా కొందరు దిశ పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన చేయడం బాధాకరమన్నారు. టీడీపీ నాయకులు దిశ చట్టమే లేదని అపహాస్యం చేస్తూ తీవ్ర ప్రచారం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో అనేక మంది మహిళలు దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. దాదాపు 40 లక్షలమంది దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని హోంమంత్రి స్పష్టంచేశారు. దాదాపు 1500 కేసుల్లో 7 రోజుల్లోనే ఛార్జిషీటు వేయడం జరిగిందన్నారు. మహిళల రక్షణ విషయంలో ప్రతిపక్ష టీడీపీ నాయకులు సలహాలివ్వాల్సింది పోయి.. దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. కాలేజ్ విద్యార్థినిలు, మహిళలు దిశ యాప్ ను వాడటం వలన భద్రత లభిస్తోందని చెబుతున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ నాయకులు మహిళల నమ్మకాన్ని వొమ్ము చేస్తున్నారని హోంమంత్రి మండిపడ్డారు. దిశ చట్టాన్ని, మహిళల భద్రత విషయాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం బాధాకరమన్నారు. దిశ వచ్చిన తరువాత ఎంత మంది మహిళలు దీని వలన రక్షణ పొందారు అనే మంచిని గ్రహించాలన్నారు. మహిళల భద్రతను బలోపేతం చేసేందుకు టీడీపీ నాయకులు సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.

Related Posts