ఏపీలో ప్రస్తుతం పెన్షన్ల తొలగింపు దారుణంగా వుంది అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి కోసిగి లో స్ధానిక యం పి డి ఓ ఆఫీసు వద్ద నిరసన వ్యక్తం చేసి యం పి డి ఓ కి వినతి పత్రం అందచేసిరు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పింఛన్ల పైనే జీవనం కొనసాగిస్తున్న ఎందరో వృద్ధులు వితంతువులు వంటి వారి పింఛన్లను నేడు వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన లో తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. మాట తప్పను మడమ తిప్పను అని సినిమా డైలాగ్ లతో ఊదరగొట్టిన జగన్ నేడు చేస్తున్నది ఏంటని ప్రశ్నించారు. పెన్షన్లకు అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ ఏదో ఒక సాకుతో పెన్షన్లను తొలగిస్తున్నారని అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేయడం వల్లనే రాష్ట్రంలోఆదాయం తో పాటు అభివృద్ధి కూడా సర్వ నాశనం అయిందని దీని వల్లనే పింఛన్లు సైతం ఇవ్వ లేకపోవడంతో పరోక్షంగా వాళ్లు ఏదో ఒక సాకుతో పెన్షన్లు తొలగిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో పెన్షన్లను తొలగించారని అన్నారు.అధికారంలో రాగానే 3000 పెన్షన్ చేస్తారన్న జగన్ ప్రభుత్వం నేడు ప్రస్తుతం ఉన్న పెన్షన్లను కూడా ఇవ్వలేక వాటిని సైతం తొలగిస్తున్నారని అన్నారు.వెంటనే తొలగించిన పెన్షన్ లతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు ముత్తు రెడ్డి రైతు సంఘం కార్యదర్శి నాడిగేని అయ్యన్న సీనియర్ నాయకులు పల్లెపాడు రామిరెడ్డి తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి జ్ఞానేష్ చితలగేని నర్సిరెడ్డి సుగూరు నాగేష్ చిలుక తాయన్న చిన్న భూంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు లక్ష్మీకాంత్ గోపాల్ నాడిగేని వీరారెడ్డి తాయన్న పంపాపతి రంగన్న డీలర్ నరసన్న హోటల్ విరేష్ బుజ్జి స్వామి ప్రభాకర్ రెడ్డి రణ తిక్కన్న కప్పయ్య యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి సల్మాన్ రాజు బెళగల్ సర్పంచ్ రామయ్య బసవలింగప్ప చాకలి శివ శిను వీరారెడ్డి హనుమంతు రెడ్డి తెలుగు యువత దుద్ది నాగేష్ వీరారెడ్డి మారేష్ రాజు మహదేవ హనుమంతు గుండేష్ ఉసేని ప్రకాష్ ఆనంద్ రాజు అన్ని గ్రామాలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు