YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వెంకన్నకు తలనీలాల ద్వారా 18 కోట్ల ఆదాయం

వెంకన్నకు  తలనీలాల  ద్వారా 18 కోట్ల ఆదాయం

కలియుగ దైవం తిరుమల వెంకన్న దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామి వారికి మ్రెక్కులలో భాగంగా తలనీలాలు సమర్పిస్తామని మోక్కుకుంటారు భక్తులు. మరి కొందరు తమ పిల్లల పుట్టు వెంట్రుకలను వెంకన్నకు సమర్పిస్తారు. ఎంతో దూరాల నుంచి ఏడుకొండలు దాటి వచ్చి శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తుంటారు. ఇలా శ్రీవారికి భక్తులు ఇచ్చే తలనీలాల నుంచి కూడా భారీ ఆదాయం టీటీడీ గడిస్తోంది. శ్రీవారి హుండీ తర్వాత తలనీలాల విక్రయం ద్వారానే టీటీడీ కి ప్రధానంగా ఆదాయం వస్తోంది. ఏప్రెల్ నెలలో భక్తులు సమర్పించి వచ్చిన తలవెంట్రుకలను టీటీడీ అదికారులు ఈ-వేలంలో అమ్మకాలు నిర్వహించగా 18 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలలో స్వామికి భక్తులు సమర్పించుకొన్న తలనీలాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.17.82 కోట్లు. తల వెంట్రుకలను జూలైలో వేలం వేయగా రూ.11.88 కోట్లు, ఆగస్టులో రూ.5.94 కోట్లు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొన్నది.. దర్శనం కోసం వేచి ఉండే భక్తుల శిశువులకు ఉచితంగా పాలు పంపిణీ చేసేందుకు రూ.11.28 కోట్ల వ్యయంతో సుమారు 40 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు. లడ్డు, ఇతరత్రా ప్రసాదాల తయారీ కోసం హర్యానాలోని కర్నల్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ నుంచి 2.25 లక్షల కిలోల ఆవు నెయ్యిని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొన్నామని పేర్కొన్నారు..ఇలా ఆన్ లైన్ వేలం ప్రక్రియ మొదలైందో అప్పటి నుంచి భారీ గా శ్రీవారికి బక్తులు సమర్పించే కురుల నుంచి టీటీడీకి ఆదాయం వస్తోంది. ఏటా దాదాపు రెండు వందల కోట్ల వరకు కురుల వేలం ద్వారా నిధులు సమకూరుతున్నాయి. ఏటా మూడు నెలలకొక సారి వేలం ప్రక్రియ నిర్వహించేది టీటీడీ. తల నీలాలలను ఐదు గ్రేడులుగా ప్రతినెల విభజించి వేలం వేస్తోంది టీటీడీ. కురుల నిల్వలు పేరుకు పోకుండా  ప్రతినెలా మొదటి గురువారం  ప్రభుత్వరంగ సంస్ధ ఎమ్ ఎస్ టీ ఎస్ ద్వారా తలనీలల ఈ-వేలం నిర్వహిస్తున్నారు టీటీడీ అధికారులు. ఒకప్పుడు వ్యాపారులకు బహిరంగ వేలం నిర్వహించేది టీటీడీ. అయితే వ్యాపారులు సిండికేట్ అయి తక్కువ రేట్ కు కోడ్ చేస్తుండటంతో టీటీడీ భారీగా ఆదాయాన్ని కోల్పోవలసి వచ్చేది. కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎమ్ ఎస్ టీఎస్ ద్వారా 2012 నుంచి బహిరంగ ఆన్ లైన్ వేలం నిర్వహించడం ప్రారంభించారు.

ఐదు రకాలుగా కురులు 

కురులను పొడవు బట్టి 5 రకాలు గా విభజిస్తారు. 31 ఇంచులపైన ఉండే వాటిని మొదటి రకంగా, 30 నుంచి16 ఇంచులు రెండవ రకంగా, 15 నుంచి10 ఇంచులు మూడోరకం , 9 నుంచి 5 ఇంచులు నాలుగో రకంగా, 5 ఇంచుల కన్నా తక్కువ ఉన్నవాటిని ఐదవరకంగా విభజిస్తారు. అలాగే తెల్ల వెంట్రుకలను మరో కేటగిరిగా ఉంచుతారు. తలనీలాల నిల్వల కోసం తిరుపతి తిరుమలలో ప్రత్యేక గోడౌన్లను కూడా ఏర్పాటు చేసింది టీటీడీ. కానీ ఈ మద్యకాలంలో తలవెంట్రుకలు భారీగా పేరుకు పోతున్నడంతో.... మూడు నెలలకు బదులు ప్రతినెల వేలం ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా కురుల వేలం ధరలు  మొదటిరకం కిలో 23,071 రూపాయలు పలకగా, 300 కిలోలు అమ్ముడైనాయి. ఇక రెండవ రకం.. కిలో 17,223 రూపాయలు పలకగా, 5,100 కిలోలు అమ్ముడైనాయి. తద్వారా 8.78 కోట్లు ఆదాయం వచ్చింది. ఒక మూడో రకం.. కిలో 2,832 రూపాయలు పలుకగా 6,000 వేల కిలోలు అమ్ముడైనాయి. నాలుగవ రకం కు సంబందించి కిలో 1,192 రూపాయలు ధర పలుకగా, 500 కిలోలు అమ్ముడైనాయి. ఇక  ఐదకరకం కిలో 35 రూపాయలు చొప్పున 2,000 కిలోలు అమ్ముడైనాయి. తెల్ల వెంట్రుకలు కిలో 6,371 రూపాయలు ధరలు పలకగా 5,200 కిలోలు అమ్ముడైనాయి. అన్నిరకాల  తలనీలాలను వేలం నిర్వహించగా 11.24 కోట్ల ఆదాయం వచ్చింది.

Related Posts