ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తా: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ సెప్టెంబర్ 3
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు.ప్రభుత్వంపై భారం కాకుండా సొంతంగా నిలబడేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ప్రయాణికులకు మంచి సర్వీసును అందించేందుకు కృషి చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని సజ్జనార్ చెప్పారు. నని తెలంగాణ ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్‌ిజలపై కూడా ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి.. సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ సూచించారు. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు చేపడుతాం. ఆర్టీసీ అభివృద్ధి విషయమై అధ్యయనం చేసి, కార్యాచారణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఆర్టీసీకి చాలా ఏండ్లుగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ప్రభుత్వానికి భారం కాకుండా సొంతంగా నిలబడేందుకు చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేసిన సందర్భాల్లో.. ఆర్టీసీ అధికారులతో సమావేశం అయ్యాను. ఆర్టీసీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన అనుభవం ఉందన్నారు. గత ఏడాదిన్నర కాలం నుంచి ప్రపచం వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ కూడా బాగా దెబ్బతిన్నది. రవాణా పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నది. టూరిజం వ్యవస్థ కూడా ఎఫెక్ట్ అయింది అని సజ్జనార్ పేర్కొన్నారు.
కరోనా సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు కీలకపాత్ర
గత 2 సంవత్సరాల్లో డిజీల్ రేట్లు రూ. 21 పెరిగింది. స్పేర్ పార్ట్స్ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి అని సజ్జనార్ తెలిపారు. దీంతో సమస్యలు రావడం జరిగిందన్నారు. మన ఆర్టీసీ సిబ్బంది కరోనా సమయంలో కూడా బాగా పని చేశారు. ఆక్సిజన్ సిలిండర్లతో పాటు మెడిసిన్స్‌ను ట్రాన్స్‌పోర్టు చేయడంలో చాలా కీలకపాత్ర పోషించారు. చాలా మంది ప్రాణాలను మనం కాపాడగలిగాం. ఆదాయాన్ని పెంచేందుకు కార్గో పార్శిల్ సర్వీసును ప్రారంభించాం. దాంతో కొంత ఆదాయం పెరిగిందన్నారు. మరింత ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఆదుకున్నారు. లాక్‌డౌన్ సమయంలోనూ ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించారు.గత మూడేండ్ల నుంచి ఇంచార్జి ఎండీగా పని చేసిన సునీల్ శర్మకు సజ్జనార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.