YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మత్స్యకారులకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం: హరీశ్‌ రావు

మత్స్యకారులకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం: హరీశ్‌ రావు

మత్స్యకారులకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం: హరీశ్‌ రావు
హుజూరాబాద్‌ సెప్టెంబర్
రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చేలా సీఎం కేసీఆర్‌ చర్యలు‌ తీసుకుంటున్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం లేనంతగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ మత్స్యకారులకు అండగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో మత్స్య కారుల‌ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫిషరీస్ కార్పోరేషన్ మాజీ‌ చైర్మన్ పోలి లక్ష్మణ్ ముదిరాజ్ మంత్రి హరీశ్‌ రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో చేపల ఉత్పత్తి ఘణనీయంగా పెరిగిందన్నారు. 2016-17 సంవత్సరంలో రాష్ట్రంలో 1.97 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, 2020-21 సంవత్సరం నాటికి అది 3.49 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు.ఇక్కడ ఉత్పత్తయిన చేపలలో 60 శాతం రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తుండగా మిగిలిన వాటిలో 21 శాతం పశ్చిమ బెంగాల్‌కు, 19 శాతం చేపలను అసోం, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కానీ మత్స్యకారులు మధ్యదళారులకు తక్కువ ధరకే చేపలను విక్రయించి నష్టపోతున్నారని వాపోయారు. వారికి ఆర్థికంగా లబ్ది చేకూర్చే ఉద్దేశంతో మత్స్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేరుగా మత్స్యకార సంఘాల నుంచి చేపలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని వెల్లడించారు.మత్స్య ఫెడరేషన్ కొనుగోలు చేసిన చేపలను నాణ్యతా ప్రమాణాలతో ‘తెలంగాణ చేపలు’ అనే బ్రాండ్‌తో మార్కెటింగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నదని చెప్పారు. మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపర్చడంలో భాగంగా మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్‌ను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందని, మత్స్య సొసైటీల నుంచి కొనుగోలు చేసిన చేపలను రెండు, మూడు మండలాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రవాణా చేస్తామన్నారు.40 నుంచి 50 క్లస్టర్లకు ఒక ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్‌కు అనుసంధానం చేస్తామని వెల్లడించారు. తొలుత హైదరాబాద్‌లోని శేరిగూడ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌లోని మత్స్య శాఖకు చెందిన భూములలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Related Posts