YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వివిధ రైల్వే ప్రాజెక్టులకు భూమి సేకరించి అప్పగించేందుకు మూడు నెలలు గడువు కోరిన సిఎస్

వివిధ రైల్వే ప్రాజెక్టులకు భూమి సేకరించి అప్పగించేందుకు మూడు నెలలు గడువు కోరిన సిఎస్

వివిధ రైల్వే ప్రాజెక్టులకు భూమి సేకరించి అప్పగించేందుకు మూడు నెలలు గడువు కోరిన సిఎస్
విజయవాడ, సెప్టెంబర్ 3
రాష్ట్రంలో విజయనగరం- టిట్లాఘర్ 3వ రైల్వే లైను ప్రాజెక్టు,నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం తోపాటు కడప-బెంగుళూర్ నూతన రైలు మార్గాలకు సంబంధించి మిగతా భూమి సమీకరించి అప్పగించేందుకు గాను మరో మూడు మాసాలు అనగా డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ప్రగతి ప్రాజెక్టులు రైల్వే, బొగ్గు,ఇంధనం,స్టీల్ ప్రాజెక్టులకు చెందిన 13 పెండింగు అంశాలపై ఆంధ్రప్రదేశ్,ఒడిస్సా,ఛత్తీస్గడ్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం ఢిల్లీ నుండి ప్రగతి ప్రాజెక్టుల మానిటరింగ్ గ్రూపు కో-చైర్మన్ అయిన కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ, రసాయన,ఎరువులు శాఖామాత్యులు మనీష్ మాండవీయ,మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెన్స్ చార్జీ ఫర్  సైన్స్ అండ్ టెక్నాలజీ,ఎర్త్ సైన్సెస్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పియంఓ ఫెర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియెన్సెస్ డా.జితేంద్ర సింగ్ లు వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విజయనగరం-టిట్లాఘర్,నడికుడి-శ్రీకాళహస్తి,కడప-బెంగుళూరు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మిగతా భూమి సేకరించి అప్పగించేందుకు మరో మూడు మాసాలు సమయం కావాలని విజ్ఞప్తి చేయుగా కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించిందించి ఆగడువులోగా భూమి అప్పగించాలని చెప్పారు.ప్రగతి ప్రాజెక్టులను ప్రధాన మంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నందున  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈవిషయంలో అత్యంత శ్రద్ధ కనపర్చి ఆయా ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా తోడ్పడాలని కేంద్ర మంత్రులు సూచించారు.వివిధ రాష్ట్రాల వారీ ప్రగతి ప్రాజెక్టులు పెండింగ్ అంశాలను వారు సిఎస్ లతో సమీక్షించారు.

ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులకు భూమి సమీకరణకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ డిసెంబరు నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని అప్పటికి మిగతా భూమి అప్పగింత ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు. ఇప్పటికే ఆయా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అవసరమైన భూమిలో కొంతమేర రైల్వే శాఖకు అప్పగించగా మిగతా భూమిపై వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.దీనిలో భాగంగా ప్రభుత్వ భూమిని గుర్తించడం తోపాటు ప్రైవేట్ భూమిని సేకరించి ఇచ్చేందుకు ఆయా భూమి యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ కేంద్ర మంత్రులకు వివరించారు.
ఇప్పటి వరకూ ఆయా ప్రాజెక్టులకు భూమి సమీకరించి అందించిన వివరాలను సిఎస్ కేంద్ర మంత్రులకు వివరించారు. అదేవిధంగా కొవ్వూరు- భద్రాచలం నూతన రైల్వే లైను నిర్మాణ ప్రాజెక్టు రాష్ట్ర విభజన అంశంలో ఉందని ఆప్రాజెక్టు అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్  పేర్కొన్నారు.

Related Posts