YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చిన్న పరిశ్రమల ద్వారా 10 లక్షల మందికి ఉద్యోగాలు

చిన్న పరిశ్రమల ద్వారా 10 లక్షల మందికి ఉద్యోగాలు

చిన్న పరిశ్రమల ద్వారా 10 లక్షల మందికి ఉద్యోగాలు
విజయవాడ, సెప్టెంబర్ 3, 
రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమలను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ తరహా పరిశ్రమల్ని ఆదుకునేందుకు నేడు శ్రీకారం చుట్టామని తెలిపారు. తద్వారా 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం చెప్పారు. పరిశ్రమలు తెచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్న సీఎం.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇన్సెంటివ్స్‌ ఇస్తుందన్న నమ్మకం కలిగించాలని సీఎం అన్నారు. గతంలో హడావుడి ఎక్కువగా.. పని తక్కువగా ఉండేదని చంద్రబాబు సర్కారుపై సీఎం జగన్ విమర్శలు చేశారు.కొప్పర్తిలో వైఎస్సార్‌ ఈఎంసీ పార్క్‌ను స్థాపిస్తున్నామని సీంఎం జగన్ తెలిపారు. రూ.10వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా వైఎస్సార్‌ ఈఎంసీ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా కష్టకాలంలో వరుసగా రెండో ఏడాది కూడా పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని జగన్ స్పష్టం చేశారు. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదన్న లక్ష్యంతో ఈ ఏడాది కూడా ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను అందిస్తోందని జగన్ తెలిపారు.

Related Posts